సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్… స్టూడెంట్స్ కు మాస్కులు

  • Published By: bheemraj ,Published On : July 31, 2020 / 03:44 PM IST
సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్…  స్టూడెంట్స్ కు మాస్కులు

ప్లాస్మా దాతలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. మంచి భోజనం, ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విద్యా కానుకతోపాటు పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.



అలాగే ప్లాస్మా థెరపీపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. కొద్ది సేపటి క్రితమే ఆస్పత్రిలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో పాటు కోవిడ్ నియంత్రణ చర్యలకు సంబంధించి అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ప్లాస్మా థెరపీకి సంబంధించి కూడా కొన్ని ఆదేశాలిచ్చారు.

ఏపీలో ప్లాస్మా థెరపీ పట్ల అవగాహన పెంచాలన్నారు. రికవరీ రేటు ఎక్కువగా ఉంది కాబట్టి రికవరీ అయిన వాళ్లు ప్లాస్మా థెరపీలో భాగంగా ప్లాస్మాను దానం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ప్లాస్మా దానం చేసే వాళ్లకు ప్రోత్సాహకంగా రూ.5000 అందిచాలనీ సీఎం జగన్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు.



ప్లాస్మా ఇచ్చినటువంటి వారి ఆరోగ్యానికి సంబంధించి మంచి ఆహారం తీసుకునేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. దీంతో పాటు కోవిడ్ కేసులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి కాబట్టి ఆస్పత్రుల కొరత రాకూడదన్నారు. ఆస్పత్రిలో బెడ్లు లేవని పేషెంట్లు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడాదన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల సదుపాయం ఎక్కడెక్కడ ఎంతెంత ఉందన్న సమాచారం బోర్డులు పెట్టి డిస్ ప్లే చేయాలన్నారు. బెడ్లు అందివ్వకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.