Adimulapu Suresh : అమెరికాలో లక్షలాది కరోనా కేసులు వస్తున్నా స్కూళ్లు మూసివేయలేదు

ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవుల పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి..

Adimulapu Suresh : అమెరికాలో లక్షలాది కరోనా కేసులు వస్తున్నా స్కూళ్లు మూసివేయలేదు

Minister Adimulapu Suresh

Adimulapu Suresh : ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవుల పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. సోమవారం (జనవరి 17) నుంచి యథావిధిగా విద్యా సంస్థలు తెరుచుకుంటాయని మంత్రి స్పష్టం చేశారు.

టీచర్లకు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని మంత్రి చెప్పారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భౌతికదూరం పాటిస్తూ పిల్లలు స్కూల్ కి హాజరవ్వాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో వచ్చే వారం నాటికి విద్యార్థులకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు.

Omicron Variant: డెల్టా కంటే పిల్లలపై ఒమిక్రాన్ ప్రమాదమే ఎక్కువ !

కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో ఏపీలోనూ సెలవులు పొడిగిస్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. స్కూళ్లకు సెలవులు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే లేదని అన్నారు. స్కూళ్లు యథావిధిగా ప్రారంభం అవుతాయని ప్రకటించిన మంత్రి, భవిష్యత్తులో పరిస్థితి మేరకు నిర్ణయం ఉంటుందన్నారు.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

”టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. 15 నుంచి 18 ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులకు 90 శాతానికి పైగా వ్యాక్సిన్లు ఇచ్చాము. కరోనా పట్ల ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. అమెరికాలో లక్షలాది కేసులు వస్తున్నప్పటికీ విద్యాసంస్థలను మూసివేయలేదు” అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

”ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రతపైనా నిఘా ఉంచడం జరిగింది. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు. భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తాము” అని మంత్రి సురేశ్ అన్నారు. ఏపీలో ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడం తెలిసిందే. రేపటి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.