ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు రీఓపెన్ 

  • Published By: srihari ,Published On : May 27, 2020 / 07:30 AM IST
ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు రీఓపెన్ 

ఏపీలో ఆగస్టు 3నుంచి స్కూలు ప్రారంభమవుతాయని రాష్ట్ర సీఎం జగన్ వెల్లడించారు. స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక అందిస్తామన్నారు. బ్యాగు, మూడు జతల యూనిఫారమ్స్, బెల్టు, బూట్లు, సాక్సులు, టెక్ట్స్‌బుక్స్, నోట్‌ బుక్స్‌, మంచి క్వాలిటీతో ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉంటుందన్నారు.

అలాగే ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఉంటుందని తెలిపారు. స్కూళ్లలో పిల్లలు ఏం తింటున్నారన్నదానిపై ఒక ముఖ్యమంత్రి దృష్టిపెట్టడం బహుశా ఇదే తొలిసారి గా చెప్పవచ్చు. పిల్లలకు పెట్టే ఆహారంలో నాణ్యతతోపాటు రుచికరంగా ఉండేలా చూస్తామన్నారు. వారికి ప్రతిరోజు పోషకాహారం కలిగిన పలు రకాల ఆహారాన్ని అందిస్తామని తెలిపారు.

పిల్లలకు ప్రతిరోజు ఒక ఫుడ్ మెనూ ఉంటుందని అందులో ఒకరోజు పులిహోరా, వెజిటేబుల్ రైస్, బెల్లం పొంగలి, కోడిగుడ్లు ఇలా మంచి రుచికరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యమన్నారు. పిల్లల కోసం జగనన్న గోరుముద్ద పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. 

ప్రతి మండలంలో ఒక మంచి హైస్కూల్‌ను జూనియర్ ‌కాలేజీగా మారుస్తున్నామని జగన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నామని అన్నారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యా భోదన కొనసాగాలని చెప్పారు. నా రాష్ట్ర పిల్లల కోసమే పెట్టుబడి పెడుతున్నానని అన్నారు. 

వచ్చే ఏడాది అమ్మ ఒడి పొందాలంటే 75శాతం అటెండెన్స్‌ తప్పనిసరి గా ఉండాలని జగన్ తెలిపారు. ప్రతి తల్లీ తమ పిల్లాడ్ని స్కూలుకు పంపాలని సూచించారు. మొదటి ఏడాది ఇస్తున్నప్పుడే నిబంధనలు ఎందుకని దానిజోలికి పోలేదని అన్నారు. రెండో ఏడాది నుంచి పిల్లల అటెండెన్స్‌ని పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు.  ఇంగ్లిషు మీడియం బోధనను టీచర్లు సంతోషంగా అంగీకరించారని, యాప్‌ ద్వారా వారు శిక్షణ పొందుతున్నారని జగన్ పేర్కొన్నారు. 

Read: ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు, 58కి పెరిగిన మరణాలు