Pudimadaka Beach : పూడిమడక బీచ్ లో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు..రెండు మృతదేహాలు లభ్యం, మరొకరికి ఆస్పత్రిలో చికిత్స

అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిన్న ఒక విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువస్తే ఇవాళ సముద్రంలో మరొకరి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్‌ గుర్తించాయి. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు నిన్న బీచ్‌లో గల్లంతయ్యారు.

Pudimadaka Beach : పూడిమడక బీచ్ లో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు..రెండు మృతదేహాలు లభ్యం, మరొకరికి ఆస్పత్రిలో చికిత్స

Pudimadaka Beach

Pudimadaka beach : అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిన్న ఒక విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువస్తే ఇవాళ సముద్రంలో మరొకరి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్‌ గుర్తించాయి. మొత్తం ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు నిన్న బీచ్‌లో గల్లంతయ్యారు.

ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమైతే…మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజకు విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. గల్లంతైన మిగతా నలుగురి విద్యార్థుల కోసం నేవీ, కోస్ట్‌గార్డ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఇటు బోట్లు, అటు హెలికాప్టర్లలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు తమ పిల్లల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు సముద్ర తీరంలో ఎదురుచూస్తున్నారు.

Pudimadaka Beach : అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

అనకాపల్లి దగ్గర సముద్రంలో గల్లంతైన నలుగురు విద్యార్థుల కోసం గాలింపు తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడటంతో గాలింపు ఆపేసిన అధికారులు.. ఇవాళ పొద్దున్నే తిరిగి మొదలుపెట్టారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. స్టూడెంట్స్‌ ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయం కూడా తీసుకుంటున్నారు. అనకాపల్లి బీచ్‌లో నిన్న ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.