Visakhapatnam : పెళ్లిరోజు భర్తతో కలిసి ఆర్కే బీచ్ కు వెళ్లిన వివాహిత గల్లంతు..కొనసాగుతున్న గాలింపు చర్యలు

విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలసి ఉన్నారు. అయితే సాయి ప్రియ భర్తకి ఫోన్ లో మెసేజ్ రావడంతో వెనక్కొచ్చి మెసేజ్ చూసుకొని తిరిగి చూసేసరికి సాయి ప్రియ కనబడలేదు.

Visakhapatnam : పెళ్లిరోజు భర్తతో కలిసి ఆర్కే బీచ్ కు వెళ్లిన వివాహిత గల్లంతు..కొనసాగుతున్న గాలింపు చర్యలు

Missing

Visakhapatnam : విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలసి ఉన్నారు. అయితే సాయి ప్రియ భర్తకి ఫోన్ లో మెసేజ్ రావడంతో వెనక్కొచ్చి మెసేజ్ చూసుకొని తిరిగి చూసేసరికి సాయి ప్రియ కనబడలేదు.

బీచ్ లో కెరటాలకు కొట్టుకుపోయిందని భావించి పోలీసులకు పిర్యాదు చేశారు. భార్య కొట్టుకుపోవడం తాను చూడలేదని భర్త శ్రీనివాసు అంటున్నారు. మెసేజ్ చూసి వచ్చే సరికి సాయి ప్రియ కనబడలేదని చెబతున్నారు. గజ ఈతగాళ్ళు సాయంతో బీచ్ లో గాలించగా ఆచుకీ లభ్యం కాలేదు.

Madhurawada Murali Missing Case : ఆమెకు 35.. వాడికి 18.. మధురవాడ మురళి మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు

అయితే, సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివాహిత అదృశ్యంపై పలు అనుమానాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. అసలు బీచ్ లో కొట్టుకుపోయిందా? లేదా మరేదన్న జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.