అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫొటో తొలగించండి

అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫొటో తొలగించండి

SEC Nimmagadda letter to CS : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల్లో ఫొటీ చేసే అభ్యర్థులకు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ఉంచటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే తహశీల్దార్లకు ఆదేశాలివ్వాలని ప్రధాన కార్యదర్శిని నిమ్మగడ్డ ఆదేశించారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫొటోలు ఉంచటం వ్యతిరేకమన్నారు. ఇది ఎన్నికల నియమావళికి వ్యతిరేకమన్నారు. ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫొటో లేకుండా జారీ చేయాలని ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

మరోవైపు ఏపీ ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల్లో ఇరువురి మధ్య వివాదం నెలకొనగా.. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నియామకం విషయంలో కూడా నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపితే, వారిలో ఒకరిని ఎస్ఈసీ ఎంపిక చేయాల్సి ఉంటుంది.

కానీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సీనియర్ ఐఏఎస్ అధికారి రవిచంద్రను నియమించి, ఆదేశాలు జారీ చేశారు. అయితే కాసేపటికే ప్రభుత్వం రవిచంద్రను వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా నియమించింది. దీంతో మరో వివాదం మొదలైంది.