ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్…హాజరుకాని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు

ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్…హాజరుకాని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు

SEC Nimmagadda ramesh conduct video conference : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం అయింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు హాజరుకాలేదు. అలాగే పలు జిల్లాల అధికారులు కూడా కాన్ఫరెన్స్ కు దూరంగా ఉన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకావాలని సీఎస్ నుంచి కలెక్టర్లకు ఆదేశాలు అందలేదు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు దూరంగా ఉన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దిసేపటికి క్రితం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, ఎస్ పీలు, జిల్లా పరిషత్ డీఈవోలు, పంచాయతీ రాజ్ కు సంబంధించిన డీపీవోలు ఈ కాన్ఫరెన్స్ కు హాజరుకావాల్సింది.

అయితే ఏ జిల్లా నుంచి కూడా ఒక్క అధికారి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేదు. 24 గంటల ముందే వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని, అన్ని జిల్లా అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది… ఎలాంటి ఎన్నికలు జరిగినా జిల్లా కలెక్టరే బాధ్యతగా ఉంటారని నిమ్మగడ్డ ప్రకటించారు.

జిల్లా రిటర్నింగ్ అధికారిగా ఉండే జిల్లా కలెక్టర్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలి. దీంతోపాటు లా ఆండ్ ఆర్డర్ మెయింటెయిన్ చేయాల్సిన జిల్లా ఎస్పీ, అదేవిధంగా లోకల్ బాడీస్ కు సబంధించిన జిల్లా పరిషత్ ఈవో, జిల్లా పంచాయతీ అధికారులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనాలి.

పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శులు కూడా పాల్గొనాలి. కానీ ఎవరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనలేదు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరోసారి గవర్నర్ కు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్ ఈసీ నిమ్మగడ్డ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

సాయంత్రం 5 గంటల వరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్రస్థాయి అధికారులు దూరంగా ఉన్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ కు పంచాయతీరాజ్ శాఖ అధికారులు హాజరుకాలేదు. సీఎస్ నుంచి కలెక్టర్లకు ఆదేశాలు అందలేదు.

సాయంత్రం 5 గంటల తర్వాత ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ సీఎస్ కు లేఖ రాయనున్నారు. వీడియోకాన్ఫరెన్స్ కు అధికారులు హాజరుకాకపోవడంపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కోరే అవకాశం ఉంది.