SEC Nimmagadda Petition : గవర్నర్‌కు రాసిన లేఖల లీక్ పై సీబీఐ విచారణ కోరుతూ.. ఏపీ హైకోర్టులో ఎస్ఈసీ నిమ్మగడ్డ పిటిషన్

ఏపీ ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి మధ్య వార్ చల్లారడం లేదు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

SEC Nimmagadda Petition : గవర్నర్‌కు రాసిన లేఖల లీక్ పై సీబీఐ విచారణ కోరుతూ.. ఏపీ హైకోర్టులో ఎస్ఈసీ నిమ్మగడ్డ పిటిషన్

Sec Nimmagadda Ramesh Kumar

SEC Nimmagadda Ramesh Kumar Petition : ఏపీ ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి మధ్య వార్ చల్లారడం లేదు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌కు తాను రాసిన లేఖలు లీకవడంపై నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

గవర్నర్‌కు తాను రాసిన లేఖ ఆధారంగానే మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తనకు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో నిమ్మగడ్డ ఆరోపించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స పేర్లను ప్రతివాదులగా చేర్చారు. ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.

మార్చి 18న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ అయ్యాయి. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎస్ఈసీ నిమ్మగడ్డకు నోటీసులు పంపారు. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు.

మంత్రులు బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిమ్మగడ్డ గవర్నర్ కు చేసిన వ్యాఖ్యలపై నోటీసులు పంపారు. ప్రివిలేజ్ కమిటీ నోటీసులతో సెలవులపై వెళ్లేందుకు నిమ్మగడ్డకు ఆటకం ఏర్పడింది.