Kadapa : బ్రహ్మంగారి మఠం వద్ద 144 సెక్షన్, పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారంలో గందరగోళం

కడప బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారం గందరగోళంగా మారుతోంది. మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో 20 మంది పీఠాధిపతులు 2021, జూన్ 12వ తేదీ శనివారం సాయంత్రం బ్రహ్మంగారి మఠానికి వస్తున్నారు.

Kadapa  : బ్రహ్మంగారి మఠం వద్ద 144 సెక్షన్, పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారంలో గందరగోళం

Section 144 At Kadapa Brahmamgari Matam

Brahmamgari Matam : కడప బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారం గందరగోళంగా మారుతోంది. మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో 20 మంది పీఠాధిపతులు 2021, జూన్ 12వ తేదీ శనివారం సాయంత్రం బ్రహ్మంగారి మఠానికి వస్తున్నారు. శైవక్షేత్రం నుంచి శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, మరో 9 మంది స్వామలు బయలుదేరగా…తెలుగురాష్ట్రాల నుంచి సాయంత్రానికి మరో 11 మంది పీఠాధిపతులు, స్వాములు చేరుకోనున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముందస్తు జాగ్రత్తలో భాగంగా అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. పీఠాధిపతులను కలవాలంటే ప్రత్యేక పాస్ లు తీసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మంది జనాలు గుమికూడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రహ్మంగారి మఠం దేవాలయానికి వెళ్లే దారులను బ్యారికేడ్ లతో మూసివేశారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు..

మరోవైపు…

బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం వ్యవహారం చిలికి చిలికి గాలివాన మారుతోంది. శైవక్షేత్ర పీఠాధిపతి శివయ్య స్వామితో పాటు మరి కొందరు దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి మెదటి భార్య కుమారునికి పీఠాధిపత్యం అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివయ్య స్వామి వాదనను విశ్వబ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మారుతీ మహాలక్ష్మి కుమారుడు గోవింద స్వామికే పీఠాధిపత్యం అప్పగించాలని విశ్వబ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

శైవక్షేత్రం పీఠాధిపతి శివయ్యస్వామి, విశ్వ బ్రాహ్మణ సంఘాలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. మూల పీఠాలకు సంబంధం లేకుండా సొంతంగా ఏర్పరచుకున్న శైవక్షేత్ర పీఠాధిపతి శివయ్యస్వామికి బ్రహ్మంగారి మఠం ఆచార వ్యవహారాలు తెలియవని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు మోహన్ రావు ఆరోపిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతికి తన వారసుడిని ఎంపిక చేసే హక్కు ఉంటుందని, వెల్లడిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం వారసుని ఎంపిక..శైవపీఠాధిపతి శివయ్య స్వామికి సంబంధం లేని వ్యవహారమని చెప్పుకొచ్చారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Read More : Eatala Resignation: ఈటల రాజీనామాకు ఆమోదం