విశాఖలో 144 సెక్షన్..వైసీపీ-టీడీపీ నేతల మధ్య ప్రమాణాల పంచాయతీ

విశాఖలో 144 సెక్షన్..వైసీపీ-టీడీపీ నేతల మధ్య ప్రమాణాల పంచాయతీ

Section 144 in Visakhapatnam.. YCP and TDP leaders promises : విశాఖలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ నేతల మధ్య ప్రమాణాల పంచాయితీ ముదిరింది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. వెలగపూడి ఆఫీస్‌కు వచ్చేందుకు యత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేత విజయనిర్మలను వెనక్కిపంపారు. భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఎమ్మెల్యే వెలగపూడిపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. తనపై చేసిన ఆరోపణలపై బాబా గుడిలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు వెలగపూడి. రామకృష్ణసవాల్‌ను స్వీకరించిన విజయ నిర్మల వైసీపీ తరపున ప్రమాణానికి సిద్ధమవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

వైసీపీ నేతల సవాల్ కు తాను సిద్ధమని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చెప్పారు. ఎంపీ విజయసాయిరెడ్డి తన సవాల్ స్వీకరించాలన్నారు. ప్రమాణం కోసం ఎవరైనా సాయిబాబా గుడికి రావొచ్చని..తాను వస్తానంటూ వెలగపూడి చాలెంజ్ విసిరారు.

ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పొలిటికల్ సెటైర్స్ విసిరారు. విజయసాయిరెడ్డికి తాను సవాల్ విసిరానని, ఆయనతోపాటు వైసీపీ నేతులు ఎవరు వచ్చినా ప్రమాణం చేస్తానన్నారు. సాయిబాబా గుడితోపాటు ఎక్కడ ప్రమాణం చేసేందుకైనా రెడీగా ఉన్నానన్నారు వెలగపూడి. తనకు ప్రజాసేవ తప్ప వేరే పనిలేదన్నారు. తనకు ఎవరి కాళ్లు పట్టుకునే అలవాటు లేదంటూ విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు.

సవాళ్లు,… ప్రతిసవాళ్లతో విశాఖ వాతావరణం వేడెక్కింది. భూ కబ్జాలపై తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చేసిన సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వెలగపూడి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్ద మూడంచెల పోలీసు పహారా ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ నేతల మధ్య ప్రమాణ సవాళ్లతో విశాఖ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

తనపై చేసిన ఆరోపణలపై బాబాగుడిలో ప్రమాణం చేయాలని వెలగపూడి సవాల్ విసిరారు. ఇవాళ సాయిబాబా గుడిలో ప్రమాణాలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తరఫున విశాఖ తూర్పు నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ విజయనిర్మల సాయిబాబా గుడికి వస్తానని తెలిపారు. ఇరు పార్టీల నాయకుల ప్రమాణ సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు.