Andhra Pradesh Three Capitals : మూడు రాజధానులు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యంకాదు .. YCP టైమ్ పాస్ చేస్తోంది : జీవీఎల్

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కేవలం కాలయాపన కోసమే చేస్తోందని..ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 3 రాజధానుల అంశంపై రోజంతా శాసనసభలో చర్చ పెట్టారని విమర్శించారు. YCP కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించటానికి మూడు రాజధానులు అంటూ టైమ్ పాస్ చేస్తోంది అన్నారు.

Andhra Pradesh Three Capitals : మూడు రాజధానులు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యంకాదు .. YCP టైమ్ పాస్ చేస్తోంది : జీవీఎల్

Andhra Pradesh Three Capitals

Andhra Pradesh Three Capitals : మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని..మూడు రాజధానులు అంటూ ఏపీ ప్రభుత్వం కేవలం వృథా ప్రయాసే అంటూ కొట్టిపారేశారు బీజేపీ నేత జీవీఎల్. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని వ్యాఖ్యానించిన జీవీఎల్ అంది రాష్ట్రపరిధిలోనిదే అయినా న్యాయవ్యవస్థకు లోబడి ప్రభుత్వం పనిచేయాలని..ఏక పక్షంగా చేయటం సాధ్యంకాదన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కావని జగన్‌కు తెలుసని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కేవలం కాలయాపన కోసమే చేస్తోందని..ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 3 రాజధానుల అంశంపై రోజంతా శాసనసభలో చర్చ పెట్టారని విమర్శించారు. అమరావతి రాజధాని అని ప్రకటించాక అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి. కోర్టులూ అమరావతే రాజధాని అని ధ్రువీకరించాయి. అక్కడ కేంద్ర సంస్థల నిర్మాణాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు.

మూడు రాజధానులు అంశం కేంద్రం జోక్యం చేసుకునే అంశం కాకపోయినా గతంలో చేసినటువంటి సీఆర్డీఏ చట్టాలు..రాజధానికి భూములిచ్చిన రైతులతో ఆనాటి ప్రభుత్వం చేసిన ఒప్పందాలు ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసి తీరాలని అన్నారు. అలా చేయకుండా వైసీపీ ప్రభుత్వం మాట తప్పి మూడు రాజధానులు అంటూ కొత్తరాగం అందుకుని రాజధాని నిర్మాణాలు చేపట్టాలని కోర్టు చెప్పినా లక్ష్య పెట్టకుండా అదే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇదంతా కేవలం రాజకీయ ఎత్తుగడ కోసం..తమ పాలన వైఫల్యాన్ని డైవర్ట్ చేయటం కోసమేనని అన్నారు.

మూడు రాజధానులపై తాను కట్టుబడి ఉన్నామని దీని కోసం పకడ్బంధీగా బిల్లు తయారు చేసి మూడు రాజధానులు అమలు చేసి తీరుతామని మంత్రులు చెబుతున్నారని కానీ ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అన్నారు జీవీఎల్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువంటి బిల్లు తెచ్చే పరిస్థితి లేదని..ఒకవేళ తీసుకొచ్చిన కేవలం చర్చలే తప్ప అమలు ఎట్టిపరిస్థితుల్లోనే సాధ్యం కాదన్నారు. ఏపీ ప్రభుత్వం కేవలం వృథాగా ప్రయాస తప్ప మూడు రాజధానలు సాధ్యంకాదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.  రైతుల‌ను మోసం చేసి, ఈ నినాదాన్ని ఇంకా రాజకీయం కోసం వాడుకుంటే, రైతుల‌ను మోసం చేస్తే వారికే బెడిసి కొడుతుంద‌ని హెచ్చ‌రించారు.

ఈ మూడు రాజ‌ధానుల అంశం ప్రాక్టిక‌ల్‌గా సాధ్యం కాని ప‌ని అని వైసీపీకి కూడా తెలుస‌ని.. అందుకే గ‌తంలో మూడు రాజ‌ధానుల బిల్లును జ‌గ‌న్ స‌ర్కార్ వెన‌క్కి తీసుకుంద‌ని జీవీఎల్ గుర్తు చేశారు. మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి, స‌వ‌ర‌ణ బిల్లును గ‌న‌క తేవాల‌న్న ఉద్దేశం ఏపీ ప్ర‌భుత్వానికి ఉంటే, మొన్న‌టి అసెంబ్లీ స‌మావేశాల్లోనే తెచ్చేవార‌ని, ఎందుకు తేలేద‌ని ప్ర‌శ్నించారు. కేవ‌లం రాజ‌కీయ ఉప‌న్యాసాల కోస‌మే ఈ అంశాన్ని వాడుకుంటున్నార‌ని జీవీఎల్ మండిప‌డ్డారు.