Andra pradesh : నా భర్త పార్టీ మారితే నేను కూడా నేను కూడా మారాల్సిందే : మాజీ హోంమంత్రి సుచరిత

నా భర్త పార్టీ మారితే నేను కూడా నేను కూడా మారాల్సిందే అంటూ ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆమె పార్టీ మారుతున్నారా? దానికి ఆమె హింట్ ఇచ్చారా?

Andra pradesh : నా భర్త పార్టీ మారితే నేను కూడా నేను కూడా మారాల్సిందే : మాజీ హోంమంత్రి సుచరిత

former AP Home Minister Mekathoti Sucharita about party change

Andra pradesh : వైసీపీ పార్టీ మారడంపై ఏపీ మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్త పార్టీ మారితే నేను కూడా మారాల్సి వస్తుందని నా భర్త ఓ పార్టీలోను..నేను మరో పార్టీలోను ఉండబోమని బహుశా నా భర్త పార్టీ మారితే నేను కూడా మారాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ జగన్ తోనే ఉంటామని..తాను చెప్పిన దానికి నా భర్త దయాసాగర్ కూడా కట్టుబడి ఉంటారని అన్నారు. ఒకవేళ తన భర్త పార్టీ మారతాను, నీవు కూడా నాతో రా అని నా భర్త పిలిస్తే… ఒక భార్యగా తాను కచ్చితంగా తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పారు. తన భర్త ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, తన పిల్లలు ఇంకో పార్టీలో ఉండమని తెలిపారు. తామంతా వైసీపీ కుటుంబ సభ్యులమని..జగన్ పార్టీలో తాము ఉండగలిగినంత కాలం ఉంటామని అన్నారు. అంటే ఉన్నంత కాలం ఉంటాం అంటే ఆమె పార్టీ మారటం అనేది జరుగుతుందనే భావిస్తున్నారు పలువురు.

కాగా..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేకతోటి సుచరిత హోమ్ మినిష్టర్ అయ్యారు. రెండున్నర సంవత్సరాల తరువాత ఆమె మంత్రి పదవినుంచి తొలగించారు సీఎం జగన్. దీంతో ఆమె అలకబూనారు. దీంతో ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారని పార్టీ కూడా మారతారనే వార్తలు తీవ్రంగా వచ్చాయి. ఆ స్థాయికి ఆమెకూడా వెళ్లారు. రాజీనామా పత్రం కూడా సిద్ధం చేసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులే తెలిపారు. కానీ తరువాత జగన్ పిలిచి ఏం మాట్లాడారో గానీ బహుశా బుజ్జగించారో లేదా బెదిరించారో తెలీదుగానీ ఆమె నేను పార్టీ మారేది లేదు నన్ను హోంమంత్రి చేసిన జగన్ తోనే కలిసి నడుస్తాను అంటూ స్పష్టంచేశారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుగా సభలు,సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పర్యటనలు చేస్తున్నాయి. ఎన్నికల రథాలను సమాయత్తం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఆయా పార్టీల్లో ఉండే నేతలు మరో పార్టీల్లోకి దూకటానికి కూడా మార్గాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే అప్పటి వరకు తాము ఉన్న పార్టీయే గొప్పది..అక్కడే తమ రాజకీయ జీవితాలను కొనసాగిస్తాం అంటూ పార్టీ అధినేతలకు పొగడ్తలతో ముంచెత్తే నేలకు సడెన్ గా పార్టీలో తమకు తగిన గౌరవం దక్కటంలేదని పాట అందుకుంటుంటారు. బహుశా పార్టీ మార్పు గురించి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు కూడా అందుకు సంకేతాలనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎన్నికల దగ్గర పడుతుంటే జంప్ జినానీలు షురూ అవుతుంటాయి. ఇది సర్వసాధారణ విషయాలే. తమకు టికెట్ దక్కుతుందో లేదో అనే అనుమానం ఉన్న నేతలు పక్క పార్టీల వంక చూస్తు ఎక్కటి టికెట్ లభిస్తే ఆ పార్టీలోకి జంప్ అయిపోతుంటారు. దీంట్లో భాగంగానే వైసీపీ నుంచి కూడా పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి దూకటానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. కాగా..మరి వైసీపీ మరోసారి సుచరితకు టికెట్ ఇస్తే పార్టీలోనే ఉంటారు. లేదంటే మరోపార్టీకి జంప్ అవుతారు..దీనికి ఆమె భర్త ఓ కారణంగా చెప్పుకోవటానికి ఉన్నారు. అందుకే నా భర్త పార్టీ మారదాం అంటే మారుతాను అంటూ హింట్ ఇచ్చారు మాజీ హోమ్ మంత్రివర్యులు మహిళా మంత్రి వర్యులు..