Fatima Murder Case : ఫాతిమా మర్డర్ కేసులో సంచలన విషయాలు..15 కాసుల బంగారం కోసం హత్య

విజయవాడ యువతి ఫాతిమా హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫాతిమా దగ్గర ఉన్న 15 కాసుల బంగారం కోసం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

10TV Telugu News

Fatima murder case : విజయవాడ యువతి ఫాతిమా హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫాతిమా దగ్గర ఉన్న 15 కాసుల బంగారం కోసం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫాతిమాను జమునా బ్యారేజీలోకి నెట్టి హత్య చేసినట్లు నిందితులు వసీం, తాయబ్ అంగీకరించారు. ఒక రోజు ముందే పక్కాగా రెక్కీ నిర్వహించిన నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఫాతిమా దగ్గర ఉన్న 15 కాసుల బంగారంపై కన్నేసినా నిందితులు.. ఆ హత్య తర్వాత ఏడున్నర కాసుల బంగారాన్ని అమ్మి జల్సాలు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఫాతిమా మర్డర్ పై 10 టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించిన పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఓ పోలీస్ బృందాన్ని షహరన్ పూర్ కు పంపారు. అక్కడ దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇప్పుడు దిగ్ర్భాంతి కరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల నుంచి రాబట్టిన సమాచారంతో ప్రస్తుతం ఫాతిమా మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఆ మృతదేహం దొరికిన తర్వాత విజయవాడకు తరలించే అవకాశాలు ఉన్నాయి.

నిందితులను రెండు లేదా మూడు రోజుల్లో విజయవాడకు తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యూపీలో స్పెషల్ టీమ్ దర్యాప్తు కొనసాగిస్తోంది. అక్కడి పరిస్థితులను బట్టి మరో బృందాన్ని షహరన్ పూర్ కు పంపుతామని సీపీ ఇప్పటికే తెలిపారు. ఈ నెల 10 నుంచి ఆచూకీ కనిపించకుండా పోయిన ఫాతిమా షహరన్ పూర్ లో హత్యకు గురైంది. ఫాతిమాను ప్రేమ పేరుతో నిందితులు యూపీకి తీసుకెళ్లి హత్య చేశారు.

10TV Telugu News