AP High Court: విజయవాడ ఏసీపీకి వారం రోజుల జైలు శిక్ష!

ఏపీ హైకోర్టు మరో సంచనల తీర్పు ఇచ్చింది. విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నట్లుగా హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టును ఏసీపీ తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడింది.

AP High Court: విజయవాడ ఏసీపీకి వారం రోజుల జైలు శిక్ష!

Ap High Court

AP High Court: ఏపీ హైకోర్టు మరో సంచనల తీర్పు ఇచ్చింది. విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నట్లుగా హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టును ఏసీపీ తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఛార్జిషీట్‌ వేయాలని ఆదేశించినా ఏసీపీ శ్రీనివాసరావు పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహించిన హైకోర్టు ఈమేరకు ఏసీపీకి శిక్షను ఖరారు చేసింది.

అయితే.. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును హైకోర్టు వారంరోజులు వాయిదా వేసింది. కాగా, గతంలో కూడా ఏపీ హైకోర్టు ఇలానే కోర్టు తీర్పును ధిక్కరించారని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పష్టం చేసింది. అయితే, ఆ దేశాలను అమలు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది.

అప్పుడు హైకోర్టు.. ఐఏఎస్‌ అధికారి గౌరీ శంకర్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి చిరంజీవికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇవ్వగా.. కోర్టును క్షమాపణలు కోరిన అధికారులు మరోసారి అవకాశం ఇస్తే కోర్టు ఆదేశాలు అమలు చేస్తామని చెప్పటంతో ఆ తర్వాత వారం రోజుల జైలు శిక్ష ఆదేశాలను హైకోర్టు రీ కాల్ చేసింది. ఇక, ఇప్పుడు ఏసీపీకి అలాగే కోర్టు ధిక్కరణతో మరోసారి వారం రోజుల శిక్షను విధించగా అభ్యర్ధనతో వాయిదా వేసింది. మరి ఈ కేసులో ఎలాంటి అమలు జరుగుతుందో చూడాలి.