లాక్ డౌన్ లో యధేఛ్ఛగా వ్యభిచారం : ఇద్దరు మహిళలు అరెస్ట్

  • Edited By: murthy , June 20, 2020 / 04:45 AM IST
లాక్ డౌన్ లో యధేఛ్ఛగా వ్యభిచారం : ఇద్దరు మహిళలు అరెస్ట్

కరోనా బారిన పడకుండా లాక్ డౌన్ వేళ ఇంటిపట్టున ఉండి ప్రాణాలు కాపాడుకుంటే చాలురా భగవంతుడా అని ప్రజలంతా వణికిపోతుంటే, వ్యభిచార నిర్వాహాకులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తమ వ్యాపారం కొనసాగించేస్తున్నారు.

హైటెక్ టెక్నాలజీతో వాట్సప్ లో  అమ్మాయిల ఫోటోలు  పంపించి  ఆన్ లైన్ లో డబ్బులు  వసూలు చేస్తూ  యధేఛ్ఛగా సాగిస్తున్న  సెక్స్ రాకెట్ కు  నెల్లూరు జిల్లా పోలీసులు గండి కొట్టారు. 

కావలిలోని తటవర్తి వారి వీధిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం తో పోలీసులు ఒక ఇంటిపై దాడి చేసి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. కావలి వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read: హైదరాబాద్‌లో దారుణం, 10 ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగినా భార్యను బతికించుకోలేకపోయిన భర్త