Srikakulam : పేద మహిళ పెద్ద మనసు..కూలి డబ్బులతో బోర్ వేయించి నీటి కష్టాలను తీర్చింది

మనిషికి కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు.. సహాయం చేయడానికి మనసుంటే చాలు అంటోంది ఓ కష్టజీవి. సహాయం చేయాలనే మనస్సు ఉండాలే గానీ కష్టపడి సంపాదించి కూలి డబ్బులతో కూడా సహాయం చేయవచ్చని నిరూపించిందో పేదరాలు. కూలికి వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి గొంతెండిపోతున్న జీవితాలకు నీళ్లు అందించింది.

Srikakulam : పేద మహిళ పెద్ద మనసు..కూలి డబ్బులతో బోర్ వేయించి నీటి కష్టాలను తీర్చింది

Kalyani (1)

Srikakulam poor Women : మనిషికి కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు.. సహాయం చేయడానికి మనసుంటే చాలు అంటోంది ఓ కష్టజీవి. సహాయం చేయాలనే మనస్సు ఉండాలే గానీ కష్టపడి సంపాదించి కూలి డబ్బులతో కూడా సహాయం చేయవచ్చని నిరూపించిందో పేదరాలు. డబ్బులున్నవాళ్లు దానం చేయటం గొప్పకాదు..తనకున్న కొద్దిపాటి డబ్బును ఊరు ప్రజల కష్టం తీర్చటానికి తాగునీటి కష్టాలు తీర్చటానికి ఉపయోగించింది ఓ మహిళ. కూలికి వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బులతో పాటు తనకున్న కొద్దిపాటు డబ్బును ఖర్చు పెట్టి గొంతెండిపోతున్న జీవితాలకు నీళ్లు అందించింది. కూలీ డబ్బులతో బోర్ వేయించి..గ్రామస్తుల దాహార్తిని తీర్చింది శ్రీకాకుళం జిల్లాలోని సిక్కోలుకు చెందిన బోయిన కళ్యాణి అనే మానవతామూర్తి.

అది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటిలీలోని హడ్కోకాలనీ. ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది హడ్కో కాలనీ. దీంతో వారికి తాగునీరు అందనే అందదు. దీంతో స్థానికులు నీటి కష్టాలు తప్పటంలేదు. ఇక వేసవి వచ్చిందంటే చాలా వారి బాధలు వర్ణనాతీతం. అడుగంటిన బోర్లు, నీళ్లు అందించని కుళాయిలు. బిందెడు నీరు కావాలంటే భగీరథ యత్నమే. ఇవే ప్రతీరోజు అక్కడ కనిపించే నీటి కష్టాలు. ఈ కష్టాలను చూసి కళ్యాణి చలించిపోయింది.

మనం బతకటానికి సరిపడా డబ్బులు కావాలి. కానీ కళ్లముందే నీటి కష్టాలు పడుతుంటే డబ్బును దాచుకునే కంటే ఆ డబ్బుతో బోర్ వేయిస్తే ఎలా ఉంటుంది? నీరు తనకే కాదు తన కాలనీవాసులందరికీ చాలా అవసరం కదా? అని ఆలోచించింది. బోర్ వేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందే తడవుగా ఏమాత్రం ఆలోచించలేదు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన కూలీ డబ్బులతో పాటు తాను కూడబెట్టుకున్న లక్ష రూపాయలు స్థానిక పెద్దలకు అందించింది. అదృష్టం బాగుంది.ఎందుకంటే మంచి మనస్సుతో చేసిన పని ఏదైనా సరే సక్సెస్ అయి తీరుతుందని మరోసారి నిరూపితమైంది. కళ్యాణి డబ్బలు ఇవ్వటం పెద్దలు బోర్ పనులు మొదలు పెట్టటం గంగమ్మ పైకి తన్నుకు రావటంతో ఇలా అంతా చకచకా జరిగిపోయాయి. కళ్యాణి పెద్ద మనస్సుకు పులకించిపోయిన గంగమ్మ ఉబికి రావటంతో స్థానికులకు నీటి కష్టాలు తీరాయి.

ఏన్నో ఏళ్లుగా తాము పడుతున్న నీటి కష్టాలు తీరినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హడ్కోకాలనీలో బోరు వేయడంతో.. ఆ ప్రాంతంలోని రెండు ప్రధాన వీధులకు నీటి సమస్య తీరిందని.. అధికారులు కూడా పట్టించుకోని సమయంలో కల్యాణి చేసిన సాయం ఎప్పుడూ గుర్తుంటుందని అంటున్నారు. బోరులో నీరు పైకి రావటంతో స్థానికులతో పాటు కళ్యాణి మురిసిపోయింది. ఇప్పటికైనా మా నీటి కష్టాలు తీరాయి అంటూ సంతోషం వ్యక్తం చేసింది. కాయకష్టం చేసుకొని ఒక్కో రూపాయి పోగుచేసుకున్న మహిళ… ఆ డబ్బులతో బోరు ఏర్పాటు చేయడంపై సిక్కోలి జిల్లా వాసులు అభినందిస్తున్నారు. ఆమెను చూసి మరింత మంది స్ఫూర్తి పొందాలని అంటున్నారు. తనకోసం దాచుకున్న డబ్బును స్థానికుల కోసం ఖర్చుపెట్టిన కళ్యాణిలాంటి మంచి మనస్సు గల వ్యక్తులు ఉంటే నీటి కష్టమే కాదు ఏ కష్టాన్నైనా ఇట్టే జయించవచ్చు అని నిరూపించింది బోయిన కళ్యాణి.