Sheeps Die : పండుగ పూట అనంత విషాదం.. ఆ ఆకులు తిని భారీగా గొర్రెలు మృతి..

ఉగాది పండగ పూట అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వజ్రకరూర్ మండలం పిసి ప్యాపిలితాండలో భారీగా గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఆముదం ఆకులు తిని గొర్రెలు మృతి చెందాయి. మిగిలిన గొర్రెలు కూడా అనారోగ్యానికి గురవుతున్నాయి.

Sheeps Die : పండుగ పూట అనంత విషాదం.. ఆ ఆకులు తిని భారీగా గొర్రెలు మృతి..

Sheeps Die

Sheeps Die After Eating Castor Oil Leaves : ఉగాది పండగ పూట అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వజ్రకరూర్ మండలం పిసి ప్యాపిలితాండలో భారీగా గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఆముదం ఆకులు తిని గొర్రెలు మృతి చెందాయి. మిగిలిన గొర్రెలు కూడా అనారోగ్యానికి గురవుతున్నాయి. గ్రామంలోని నలుగురికి చెందిన 40 గొర్రెలు మృతి చెందడంతో పండగ పూట గొర్రెల కాపరుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

బాధితులు పులి లింగప్ప, పులి వీరప్ప, రామాంజనేయులు నాయక్, హేమ్ల నాయక్‌లకు 7 వందల వరకు గొర్రెలు ఉన్నాయి. రోజు మాదిరిగానే గొర్రెలను పొలంలో మేపుతుండగా ఆముదం ఆకులను తిన్నాయి. దీంతో గొర్రెల నోట్లో నుంచి జోలు కారుతూ ఒక్కొక్కటిగా చనిపోయాయి. తాము భారీగా నష్టపోయామని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.