గొర్రెల కాపరి కొంపముంచిన టిక్ టాక్ 

  • Published By: srihari ,Published On : May 21, 2020 / 11:54 AM IST
గొర్రెల కాపరి కొంపముంచిన టిక్ టాక్ 

టిక్ టాక్ పిచ్చి రోజు రోజుకు పీక్ స్టేజ్ కు వెళ్లిపోతోంది. మనసుకు ఏది తోస్తే అది చేసేస్తున్నారు. సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి స్టంట్లు, విధులు మరిచి ఉద్యోగుల డ్యాన్స్ లతోపాటు ఇంకెన్నో చూశాం. తాజాగా అనంతపురం ఓ వ్యక్తి వణ్యప్రాణులతో టిక్ టాక్ వీడియో చేసి సమస్యల్లో చిక్కుకున్నారు. 

టిక్ టాక్ గొర్రెల కాపరి కొంపముంచింది. కమ్మదూరు మండలం అయ్యంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కుందేలును చంపి కుక్కలకు పెడుతూ టిక్ టాక్ వీడియో చేశాడు. అలాగే మరో వీడియోలో జింక పిల్లను పట్టుకుని మేకతో పాలు తాగించాడు.

అయితే ఆ వీడియోలు వైరల్ కావడంతో ఫారెస్టు అధికారులు సదరు గొర్రెల కాపరిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.