Brahmamgari Matham : మఠం మంటలు, పీఠాధిపతి ఎంపికలో తమ అభిప్రాయం తీసుకోవాలి

బ్రహ్మంగారి మఠాధిపతి నియామకం విషయంలో తమ నివేదికను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వెల్లడిస్తున్నారు. ధర్మం ప్రకారం మఠాధిపతి ఎంపిక జరగాలంటున్నారు. ఇటు మఠంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ మరోసారి ఆరోపణలు చేశారు.

Brahmamgari Matham : మఠం మంటలు, పీఠాధిపతి ఎంపికలో తమ అభిప్రాయం తీసుకోవాలి

Kadapa

Saiva Kshetram Peetadhipathi : బ్రహ్మంగారి మఠాధిపతి నియామకం విషయంలో తమ నివేదికను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వెల్లడిస్తున్నారు. ధర్మం ప్రకారం మఠాధిపతి ఎంపిక జరగాలంటున్నారు. ఇటు మఠంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ మరోసారి ఆరోపణలు చేశారు.

కడప బ్రహ్మంగారి మఠాధిపతి నియామకం విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దీనిపై పలువురు పీఠాధిపతులు అక్కడకు వెళ్లి…చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దీనిపై 10tvతో ఆయన మాట్లాడారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో అనేక కోణాల్లో చూడాల్సి వస్తుందని, ధర్మశాస్త్రాలు, తదితర వాటిని చూసుకుని..50 పేజీల నివేదికను తయారు చేసినట్లు..దీనిని దేవాదాయ శాఖ మంత్రికి సమర్పించడం జరుగుతుందన్నారు.

ఆస్తులు, ఆదాయాలు అధికం కావడంతో పోటీతత్వం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంపిస్తే..తాము రాలేదని, పీఠాధిపతులు స్వచ్చందంగా ముందుకు వచ్చామన్నారు. మేనేజర్ రూ. 10 కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నారని, ఇంత ఆస్తి ఎలా వచ్చిందని సూటిగా ప్రశ్నించారు. అనేక ఆరోపణలు ఉన్నాయని, అన్యాయాలు, అక్రమాలను అడ్డుకోవాల్సి ఉంటుందన్నారు. తమ నివేదికను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

కడప బ్రహ్మంగారి మఠాధిపతి నియామకంలో ఎలాంటి పీటముడి లేదన్నారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. దివంగత పీఠాధిపతి కుటుంబ సభ్యులతో చర్చించిన ఆయన.. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం వస్తుందని.. రాని పక్షంలో దేవాదాయ, ధర్మాదాయ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే అని.. దీన్ని రాద్ధాంతం చేయొద్దని కోరారు. ఇటు పీఠాధిపతి ఎంపిక విషయంలో రాజకీయాలు తగదని.. స్వామీజీలకు పీఠాధిపతిని ప్రకటించే అధికారం లేదంటూ స్పష్టం చేశారు మంత్రి.