GST Notice : బాబోయ్.. రూ.2.50 కోట్లు కట్టమని చిరుద్యోగికి జీఎస్టీ నోటీసు, షాక్‌లో బాధితుడు

అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడులో ఓ యువకుడికి జీఎస్టీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల జీఎస్టీ కట్టాలని నోటీసు పంపారు.

GST Notice : బాబోయ్.. రూ.2.50 కోట్లు కట్టమని చిరుద్యోగికి జీఎస్టీ నోటీసు, షాక్‌లో బాధితుడు

GST Notice : అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడులో ఓ యువకుడికి జీఎస్టీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల జీఎస్టీ కట్టాలని నోటీసు పంపారు. ద్వారపూడిలోని ఓ పరిశ్రమలో చిన్న జాబ్ చేస్తున్నాడు మోహన్ కిరణ్. జీఎస్టీ నోటీసు చూసి అతడు షాక్ కి గురయ్యాడు. తన పేరుతో ఎవరో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి మోసానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.

అతడేమీ బిజినెస్ మేన్ కాదు. ఓ కామన్ మ్యాన్. కనీసం మంచి ఉద్యోగం కూడా లేదు. ఓ చిరు ఉద్యోగి అంతే. నెలంతా కష్టపడితే వచ్చే జీతంతో ఇల్లు గడవటం కూడా కష్టమే. అలాంటి చిరుద్యోగికి జీఎస్టీ అధికారులు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. రెండున్నర కోట్లు జీఎస్టీ కట్టాలని నోటీసు పంపారు. ఇప్పుడీ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది. నోటీసులు అందుకున్న యువకుడికి దిమ్మతిరిగి బొమ్మ కనపడింది.

Also Read..Nirmala Sitharaman: పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు మేము సిద్ధం: నిర్మలా సీతారామన్

చిరు ఉద్యోగి అయిన తనకు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు ఇవ్వడం ఏంటని అతడు షాక్ లో ఉండిపోయాడు. మండపేట మండలం ఇప్పనపాడుకు చెందిన మోహన్ కిరణ్ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నాడు. అతడి తండ్రి లారీ డ్రైవర్. మోహన్ కూడా జీవనం కోసం చిన్నపాటి ఉద్యోగం ఏదో చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే.. అతడికి జీఎస్టీ నుంచి నోటీసు వచ్చింది. ఢిల్లీలో జయ శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజస్‌ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారని.. గత ఏడాది మార్చి నుంచి సెస్టెంబర్ వరకు చేసిన లావాదేవీలకు సంబంధించిన జీఎస్టీని చెల్లించాలని నోటీసుల్లో ప్రస్తావించారు. ఈ నోటీసు అందుకున్న మోహన్.. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు. పోలీసులను ఆశ్రయించాడు. ఐటీ శాఖ అధికారులను కలవాలని మోహన్ కు సూచించారు.

Also Read..GST Collection: జనవరి నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఇప్పటి వరకు రెండో భారీ వసూళ్లు ఇవే ..

చిరు ఉద్యోగం చేసుకునే తన పేరు మీద సంస్థ ఉండటం.. ఢిల్లీ నుంచి జీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడం ఏంటని బాధితుడు బిత్తరపోతున్నాడు. తాను జీఎస్టీ చెల్లించేంత పరిస్థితుల్లో లేనని.. అధికారులు ఈ అంశంపై స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఈ వ్యవహారం స్థానికంగానే కాదు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. అయ్యో పాపం.. అని నెటిజన్లు బాధితుడిపై జాలి చూపిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.