మహిళను వేధించిన ఎస్సైపై వేటు.. విచారించాలంటూ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు

  • Published By: vamsi ,Published On : June 11, 2020 / 03:29 AM IST
మహిళను వేధించిన ఎస్సైపై వేటు.. విచారించాలంటూ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు

లాడ్జిలో దిగిన ఓ జంటను బెదిరించి డబ్బులు వసూలు చేసి, మహిళను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమరావతి ఎస్సై రామాంజనేయులుపై చర్యలకు సిద్ధమైంది ఏపీ మహిళా కమిషన్. ఎస్సైతోపాటు ఆయన డ్రైవర్ సాయికృష్ణను అరెస్ట్ చేసి వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయ్యాలంటూ ఆదేశించింది. 

ఈ విషయంపై విచారణ పూర్తి చేయాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాలతో తుళ్లూరు డీఎస్పీ ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఎస్సై ప్రవర్తనకు సంబంధించిన నివేదికను కోరినట్టుగా మహిళా కమిషన్ కార్యదర్శి వెల్లడించారు.

మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు సస్పెండ్ చేశారు. ఎస్సై, అతడి డ్రైవర్ ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, సత్ప్రవర్తన లేని సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Read: ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలివే