Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు

కరోనా పరిహారం వేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి బ్యాంకు వివరాలు సేకరించిన సైబర్ మాయగాళ్లు..బాధితుల బ్యాంకు ఖాతాలో సొమ్మును కాజేసిన ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది

Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు

Cyber Crime

Cyber Crime: సాంకేతికత పెరిగే కొద్ది సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు..ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. కరోనా పరిహారం వేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి బ్యాంకు వివరాలు సేకరించిన సైబర్ మాయగాళ్లు..బాధితుల బ్యాంకు ఖాతాలో సొమ్మును కాజేసిన ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మాడుగుల మండలం సాధారణ్ ఏఎన్ఎం కొండమ్మకు గురువారం నాడు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ ఏరియాలో కరోనాతో చనిపోయిన వారి వివరాలు ఇస్తే..బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో పరిహారం వేస్తామంటూ నమ్మబలికాడు.

Other Stories:TRAI Caller Name Display : ఇకపై ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు.. త్వరలో అద్భుతమైన ఫీచర్

అయితే కరోనా బాధితుల వివరాలు లేవని కొండమ్మ చెప్పడంతో..స్వరం పెంచిన మాయగాడు..కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి వివరాలు అడిగితె..లేవంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతారా? అంటూ గట్టిగా అడిగాడు. దీంతో స్థానికంగా కరోనాతో మృతి చెందిన రాజబాబు, జగన్నాథ రావు అనే ఇద్దరు వ్యక్తుల వివరాలను అందించింది కొండమ్మ. అనంతరం కేటుగాడు..రాజబాబు కుమారుడు ప్రసాద్ కు ఫోన్ చేసి..కరోనాతో చనిపోయిన మీ నాన్నకు ప్రభుత్వం తరుపున పరిహారం చెల్లిస్తున్నామని..పరిహార డబ్బులు వేయాలంటే ముందు మీ బ్యాంకు ఖాతాలో కనీసం రూ.10 వేలు ఉండాలని చెప్పాడు.

Other Stories: ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

అయితే తన బ్యాంకు అకౌంట్ లో రూ.10 వేలు లేవని, తెలిసిన వారి బ్యాంకు వివరాలు ఇవ్వొచ్చా అని అడిగాడు ప్రసాద్. అనంతరం ప్రసాద్ తన బంధువుల బ్యాంకు వివరాలు ఇవ్వగా అందులో ఉన్న రూ.70 వేలు కాజేశాడు మాయగాడు. అనంతరం జగన్నాథ రావు కుటుంబానికి ఫోన్ చేసిన మాయగాడు వారి బ్యాంకు ఖాతాలో నుంచి రూ.20 వేలు కాజేశాడు. బ్యాంకు అకౌంట్లో డబ్బులు మాయమవడంపై అనుమానం వచ్చిన బాధితులు అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా అది సైబర్ మోసమని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.