సింధూజారెడ్డిని మింగేసిన వాగు..కర్నూలు బ్రిడ్జీ దగ్గర మృతదేహం లభ్యం

  • Published By: bheemraj ,Published On : July 27, 2020 / 09:45 PM IST
సింధూజారెడ్డిని మింగేసిన వాగు..కర్నూలు బ్రిడ్జీ దగ్గర మృతదేహం లభ్యం

జోగులాంబ గద్వాల జిల్లా కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూజారెడ్డి కథ విషాదాంతం అయింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో కర్నూలు బ్రిడ్జీ దగ్గర సింధూజ మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు వాగులో కొట్టుకుపోయింది. కారులో శివకుమార్ రెడ్డి, అతని భార్య సింధూజారెడ్డి, స్నేహితుడు జిలానీ భాషా ఉన్నారు. వీరిలో శివకుమార్ రెడ్డి, జిలానీ భాషా ఒడ్డుకు చేరుకోగా సింధూజా రెడ్డి గల్లంతైంది.

కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శివశంకర్ రెడ్డి, సింధూజా భార్యాభర్తలు. ఏడాది క్రితమే వీరికి వివాహం అీయింది. శివశంకర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. స్నేహితుడైన జిలానీ భాషాతో కలిసి శుక్రవారం రాత్రి కారులో హైదరాబాద్ కు బయల్దేరారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే క్రమంలో కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్టు నుంచి బయటపడే క్రమంలో అడ్డదారిలో ప్రయాణం సాగించారు. అయితే అడ్డదారిలో సులభంగా హైదరాబాద్ వెళ్లొచ్చని భావించి…కర్నూలు దాటిన తర్వాత హైవే దిగి పుల్లూరు, కలుగొట్ల మీదుగా ప్రయాణం సాగించారు.

కలుగొట్ల శివారులోని వాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. అయితే వాగు ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయిన వారు అలాగే కారును ముందుకు పోనిచ్చారు. అయితే కొంతదూరంగా వెళ్లాక కారు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కారు నడుపుతున్న జిలానీభాషా, శివశంకర్ రెడ్డి దిగారు. వెనుక సీటులో నిద్రపోతున్న సింధూజను బయటకు తీసేందుకు ప్రయత్నించగా కారు డోర్ తెరుచుకోలేదు. ఈ లోగా కారు నీటిలో కొట్టుకుపోయింది.

సింధూజ కోసం దాదాపు 50 గంటలకు పైగా జగ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొదట సింధూజ ఉన్న కారు వాగుకు 200 మీటర్ల దూరంలో ముళ్ల పొదలో చిక్కుకుపోయి కనిపించింది. అందులో ఆమె హ్యాండ్ బ్యాగ్ మాత్రమే లభించింది. తర్వాత పెరిగిన ఉదృతిలో సింధూజారెడ్డి కోసం ముమ్మరంగా గాలించారు. అయితే సింధూజ కర్నూలు బ్రిడ్జీ దగ్గర శవమై తేలింది. సింధూజ మృతితో ఆమె కుటుంబ సభ్యులు న్నీరుమున్నీరవుతున్నారు.