Ruia Incident : తిరుపతి రుయా ఘటనలో ఆరుగురు అరెస్ట్

రుయా హాస్పిటల్‌ అంబులెన్స్ డ్రైవర్లందరూ మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేల్చారు. అంబులెన్స్ ధరలను నిర్దేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు.

Ruia Incident : తిరుపతి రుయా ఘటనలో ఆరుగురు అరెస్ట్

Ruia Incident

Tirupati Ruia incident : తిరుపతి రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియాకు అడ్డుకట్టపడింది. 10టీవీ వరుస కథనాలతో అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన అంబులెన్స్ డ్రైవర్లు నరసింహులు, క్రిష్ణమూర్తి, దొరైరాజ్, దామోదర్, ప్రభు, శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రుయా హాస్పిటల్‌ అంబులెన్స్ డ్రైవర్లందరూ మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేల్చారు. అంబులెన్స్ ధరలను నిర్దేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు. నిర్దేశిత ధరల కన్నా, ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పిడియాక్ట్ కేసులు పెడతామన్నారు.

తిరుప‌తి రుయా ఆసుపత్రి ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసులిచ్చామన్నారు. ఆర్‌ఎంవోను సస్పెండ్‌ చేశామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అలర్ట్‌గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ ఘటనపై మంత్రి రజనీని సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ ఘటన తనను కలిచివేసిందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. వైద్యుడిని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులుదులుపుకుందని విమర్శించారు.

Ruia Ambulance Mafia : రుయాలో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు.. 90కి.మీ బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

తిరుపతి రుయా ఆసుపత్రిలో నిన్న అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరాయి. దందా చేస్తూ పేదలను పీడిస్తున్నాయి. అప్పటికే కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రికి అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మరింత కుమిలిపోయేలా చేశాయి. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయా అంబులెన్సు డ్రైవర్లు.. కేవలం 90 కిలోమీటర్ల దూరానికి రూ.20 వేలు అడిగి దౌర్జన్యం చేశారు. అంతేకాదు.. ఉచిత అంబులెన్స్ వచ్చినా ఆ డ్రైవర్ ను బెదిరించి తన్ని తరిమేశారు. దీంతో ఆ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లాల్సి వచ్చింది.

అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైశ్వ అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా.. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నాయి. పని చేయడం మానేశాయి. దీంతో నిన్న రాత్రి 11 గంటలకు బాలుడు కన్నుమూశాడు. అయితే, కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి బయట ఉన్న అంబులెన్సు డ్రైవర్లను అడిగాడు. అంబులెన్సు డ్రైవర్లు రూ.20 వేలు ఇస్తేనే వస్తామంటూ డిమాండ్ చేయడంతో తన వల్ల కాదని ఆ తండ్రి చేతులెత్తేశాడు. నిజానికి బాలుడి తండ్రి నర్సింహులు రోజువారి కూలీ. పొలం దగ్గర కాపాలా కాస్తూ జీవిస్తుంటాడు.

Ruia RMO Suspended : తిరుపతి రుయా ఘటన.. ఆర్ఎంవో సస్పెండ్, ఆ నలుగురిపై క్రిమినల్ కేసులు

ఈ నేపథ్యంలో రూ.20 వేలు తను భరించలేనని.. వారి కాళ్లవేళ్ల పడ్డాడు. అయినా వారు కనికరించలేదు. ఇక లాభం లేదనుకున్న నర్సింహులు.. గ్రామంలోని బంధువులకు ఇదే విషయాన్ని చెప్పడంతో.. వారు ఉచిత అంబులెన్సు సర్వీసును పంపారు. ఆసుపత్రికి వచ్చిన ఉచిత అంబులెన్స్ డ్రైవర్ ను రుయా ఆసుపత్రి వద్ద మాఫియాగా ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకుని కొట్టారు. అక్కడి నుంచి తరిమేశారు. అంబులెన్స్ తీసుకుని లోపలికి వస్తే చంపేస్తామని డ్రైవర్ ను బెదిరించారు. తమ అంబులెన్సుల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అరాచకానికి తెరతీశారు. దీంతో ఆ తండ్రి చేసేదేమీ లేక తన బైక్ పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిపోయాడు.