Andhra Pradesh : వాహనంలో పుచ్చకాయలు..తీరా చూస్తే, షాక్ తిన్న పోలీసులు

ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎలా స్మగ్లింగ్‌ చేస్తే దొరక్కుండా ఉండొచ్చంటూ కొత్త కొత్త ప్లాన్స్‌ వేస్తున్నారు. ఎన్ని ప్లాన్స్‌ వేస్తున్నా.. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. పుచ్చకాయల మాటుల ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ అడ్డంగా చిక్కారు కడప జిల్లాకు చెందిన స్మగ్లర్లు. పుచ్చకాయల లోడ్‌ కింద ఎర్రచందనం దుంగలను తరలిస్తూ పట్టుబడ్డారు.

Andhra Pradesh : వాహనంలో పుచ్చకాయలు..తీరా చూస్తే, షాక్ తిన్న పోలీసులు

Andhra Pradesh

Smuggling Red Sandalwood : ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎలా స్మగ్లింగ్‌ చేస్తే దొరక్కుండా ఉండొచ్చంటూ కొత్త కొత్త ప్లాన్స్‌ వేస్తున్నారు. ఎన్ని ప్లాన్స్‌ వేస్తున్నా.. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. పుచ్చకాయల మాటుల ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ అడ్డంగా చిక్కారు కడప జిల్లాకు చెందిన స్మగ్లర్లు. పుచ్చకాయల లోడ్‌ కింద ఎర్రచందనం దుంగలను తరలిస్తూ పట్టుబడ్డారు.

నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెం చెక్‌పోస్ట్ వద్ద పుచ్చకాయల లోడులో ఎర్రచందనం తరలిస్తుండగా వాహనాన్ని పట్టుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది. చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా వాహనం స్పీడ్‌గా పోనిచ్చారు దుండగులు. పోలీసులు ఆ వాహనాన్ని ఛేజ్‌ చేయడంతో.. డ్రైవర్‌, క్లీనర్‌ వాహనాన్ని వదిలి పరారయ్యారు.

వాహనాన్ని తనిఖీ చేయగా.. పుచ్చకాయల కింద సుమారు రెండున్నర లక్షల విలువ చేసే 30 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. టాటా మ్యాజిక్ వాహనం, ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. కడప జిల్లా కలసపాడుకి చెందిన వాహనంగా గుర్తించారు.

Read More : Volunteer Jobs : భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్