Somu Veerraju : బీజేపీతో ఉన్నానని పవన్ కల్యాణ్ అన్నారు.. ఎవరి చర్చలు వారు చేస్తున్నారు: సోము వీర్రాజు
పల్నాడు జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతోందని.. ఆ విషయంపై ప్రజా ఛార్జిషీట్ లో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ధిక వనరులను ఈ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.

Somu Veerraju
AP capital Amaravati : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధానిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు 50000 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్యాకేజ్ కి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని పెద్దలకు తెలియజేస్తామని సోము వీర్రాజు తెలిపారు. బీజేపీతో ఉన్నానని పవన్ కల్యాణ్ చెప్పారని పేర్కొన్నారు.
అలాగే, టీడీపీతో కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారని వెల్లడించారు. ఎవరి చర్చలు వారు చేస్తున్నారని తెలిపారు. తమది కేంద్ర పార్టీ అని కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి సంబంధించి అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నామని చెప్పారు. గుంటూరులో రెండు నియోజకవర్గాల్లో సమస్యలపై ప్రజా ఛార్జిషీట్ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు.
Somu Veeraju : సీఎం జగన్‌కు బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు లేఖ
మే18తేదీ కల్లా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఛార్జిషీట్ కార్యక్రమాలు పూర్తిచేసి పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మే19వ తేదీన గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గడతామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప గుంటూరు అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఏమీ చేసిందని ప్రశ్నించారు.
పల్నాడు జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతోందని.. ఆ విషయంపై ప్రజా ఛార్జిషీట్ లో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ధిక వనరులను ఈ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. ఎన్టీపీసీలో వచ్చే డస్టును స్థానిక ప్రజలే అమ్ముకుని జీవించే వారని.. కానీ, ఈ ప్రభుత్వం రాగానే మిషనరీల ద్వారా అధికార పార్టీ నాయకులు అమ్ముకుని దోచుకుంటున్నారని విమర్శించారు.
Bonda Uma Maheswara Rao : న్యాయం చేయాలని అడిగితే రైతులపై కేసులు పెడతారా? : బోండా ఉమా ఫైర్
ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం రూ.17 వేల కోట్లు ఇస్తే కేవలం 2 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మించారని.. మిగిలిన డబ్బు అంతా ఏమైపోయిందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలు, రైతులను అన్నివిధాలా మోసం చేస్తోందని విమర్శించారు. నెల్లూరులో తమ నేతను పోలీసులు తీవ్రంగా హింసించారని.. ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని చెప్పారు.
టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు ఇవ్వకపోవటం పెద్ద అవినీతి కార్యక్రమమని.. రైతులను రోడ్డుపై నిలబెట్టారని విమర్శించారు. ఆయుష్ ఆసుపత్రిని నిర్మించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వటానికి సిద్ధంగా లేదన్నారు. నేచురల్ క్యూర్ విధానాలను పూర్తిగా పక్కన పెట్టారని పేర్కొన్నారు. ఎయిమ్స్ కూడా నీరు ఇవ్వటం లేదని వెల్లడించారు.