Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు.

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు

Bjp Will Be In Power In Ap In 2024 Elections

Somu Veerrajus : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు 10టీవీతో మాట్లాడుతూ..బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేసిన సోము ఏపీని అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యం అని అన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు అని స్పష్టం చేశారు. కొడుకులను సీఎం చేసుకోవాలనుకు పార్టీ బీజేపీ కాదని పరోక్షంగా మాజీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు.

భారతీయ జనతా పార్టీ పవర్ లోకి రావాలని కోరుకుంది అంటే అది అభివృద్ధి కోసమేనని అన్నారు. రైల్వే,పోర్టులు,నేషనల్ హైవే,రైతులు సంక్షేమం వంటి పలు కీలక అంశాలు బీజేపీ అధికారంలోకే వస్తేనే జరుగుతాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చేయడం కోసమే బీజేపీ పనిచేస్తోందన్నారు. బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తే విద్య. వైద్యం. రైతులకు గిట్టుబాటు ధరలు అనేక సంక్షేమ పథకాలు అన్నింటిని సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Also read : Jinnah Tower in Guntur: గుంటూరులోని జిన్నా టవర్‌ను కూల్చేయాలి..లేదంటే మేమే ఆ పనిచేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

రాష్ట్ర ప్రభుత్వం కిలో బియ్యం 52 రూపాయలు అమ్ముతోందని అదే బీజేపీ అధికారంలోకి వస్తే .. 42 రూపాయలకే అందిస్తామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ని వెంటనే ఉపసంహరించుకోవాలి మరొక్కసారి ఉద్యోగుల తో చర్చలు జరిపి వారి డిమాండ్లను తీర్చాలని ఈ సందర్భంగా సోము వీర్రాజు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో బీజేపీ,జనసేన పార్టీలు పొత్తులో ఉన్న పార్టీలు రెండు పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని సోము వీర్రాజు స్పష్టంచేశారు.

కాగా..ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఏపీ, తెలంగాణాలుగా విడిపోయాక బీజేపీ ఏపీలో పట్టు సాధించటానికి యత్నిస్తోంది. తెలంగాణ ఇచ్చి అటు ఏపీ, తెలంగాణాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఈనాటికి కోలుకోలేకపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినా..ఆనాటి విభజన హామీలపై ఏమాత్రం ఆసక్తి చూపటంలేదు. విభజన హామీల్లో అత్యంత కీలకమై ఏపీకి ప్రత్యేక హోదా అనే మాట ముగిసిపోయిన కథ అంటూ కుండబద్దలు కొట్టింది.

Also read : Somu Veerraju: సారాయి వీర్రాజు అని పిలవడంపై సోము సెటైర్లు

పోలవరం ప్రాజెక్టు పూర్తి మా బాధ్యత అంటూ ప్రత్యేక హోదాకు బదులుగా నామ మాత్రపు ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ ఏపీలో మాత్రం అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తో కలిసి ఏపీలో పోటీకి దిగుతానంటోంది. మరి ఏం జరుగుతుందో..వచ్చే ఎన్నికల నాటికి చిత్రాలు విచిత్రాలు ఏం జరగనున్నాయో వేచి చూడాల్సిందే.ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు అనేది ఉండదు. ఆయా పరిస్థితులను బట్టి పొత్తులు..మద్దతులు ఉంటుంటాయి. మరి మరో రెండున్నరేళ్లలో ఏమేమి జరుగుతాయో వేచి చూడాలి..