Suicide : ఇంటికి లేటుగా వస్తున్నాడని మందలించిన తండ్రి, రైలు కింద పడి కొడుకు ఆత్మహత్య

ఈ మధ్య కాలంలో యువత, పిల్లల ధోరణి ఆందోళన కలిగిస్తోంది. వారి మనస్తత్వం మరీ బలహీనంగా తయారైంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

Suicide : ఇంటికి లేటుగా వస్తున్నాడని మందలించిన తండ్రి, రైలు కింద పడి కొడుకు ఆత్మహత్య

Suicide

Suicide : ఈ మధ్య కాలంలో యువత, పిల్లల ధోరణి ఆందోళన కలిగిస్తోంది. వారి మనస్తత్వం మరీ బలహీనంగా తయారైంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో, టీచర్ మందలించిందనో, మార్కులు తక్కువ వచ్చాయనో… ఇలా చిన్న చిన్న కారణాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు.

Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 4,035 ఉద్యోగాలు భర్తీ

తాజాగా, తండ్రి మందలించాడన్న మనస్తాపంతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన హమాలీ కుమారుడు నవీన్‌ (21) ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో పాలిటెక్నిక్‌ సెకండియర్ చదువుతున్నాడు. అయితే, నవీన్‌ రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవాడు.

Amma Odi : అమ్మఒడి డబ్బులు.. ప్రభుత్వం కొత్త రూల్

ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో నవీన్‌కు తండ్రి ఫోన్‌ చేసి మందలించాడు. ఇంటికి లేటుగా వస్తున్నాడని మందలించాడు. మరోసారి అలా చేయొద్దని, ఇంటికి త్వరగా వచ్చేయాలని హితవు చెప్పాడు. అంతే, తండ్రి మందలింపుతో మనస్తాపానికి గురైన నవీన్‌.. రాత్రి ఇంటికి వెళ్లకుండా బయటే ఉన్నాడు. గురువారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

పిల్లల్లో ఈ విపరీత ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది. చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం మంచి పరిణామం కాదని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు మందలించినా, టీచర్లు తిట్టినా.. అది మీ మంచి కోసమే అని పిల్లలు గ్రహించాలి. వారు ఏం చెప్పినా పాజిటివ్ గానే తీసుకోవాలి. అస్సలు బాధ పడకూడదు. ఇలాంటి విషయాలపై పిల్లల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.