కడుపుతో ఉన్న కోడలికి నేనేం చెప్పను కొడుకా.. : కరోనా పరీక్షకు వచ్చిన కొడుకు మృతి..తండ్రి రోదన

  • Published By: nagamani ,Published On : July 31, 2020 / 04:16 PM IST
కడుపుతో ఉన్న కోడలికి నేనేం చెప్పను కొడుకా.. : కరోనా పరీక్షకు వచ్చిన కొడుకు మృతి..తండ్రి రోదన

ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి సప్తగిరి కాలనీలో గుండె చెరువైయ్యేలా చేసే అత్యంత విషాదకర ఘటన జరిగింది. కరోనా మహమ్మారి పడిన ఓ యువకుడు కడుపుతో ఉన్న భార్యను వదిలి కానరాని లోకాలు వెళ్లిపోయాడు. కళ్లముందే నేలరాలిపోయిన కొడుకుని చూసి ఆ తండ్రి గుండెలవిసిపోయేలా ఏడ్చాడు. నడిచి వచ్చిన నువ్వు ఇలా కుప్పకూలి చనిపోయావు. నిన్ను ఇంటికి ఎలా తీసుకెళ్లనురా..కడుపుతో ఉన్న కోడలికికి నేనేం చెప్పాలిరా కొడుకా..అంటూ భోరు భోరున ఏడ్చాడు.



చేతికంది వచ్చిన కొడుకుకు పెళ్లిచేశారు తల్లిదండ్రులు. కోడలు గర్భంతో ఉంది. కుటుంబం అంతా ఆనందంలో మునిగితేలుతోంది. చక్కగా సాగిపోతున్నవారి కుటుంబంలోకి కరోనా రక్కసి ప్రవేశించింది. అంతే ఒక్కసారి ఆనందం అంతా మాయం అయిపోయింది. కరోనా లక్షణాలు కనిపించటంలో సప్తగిరి కాలనీకి చెందిన కట్టమంచి సుబ్రహ్మణ్యం..అతని కొడుకు శేఖర్ కరోనా పరీక్షలు చేయించుకునేందుకు గురువారం (జులై 30,2020) తిరుపతిలోని అలిపిరి లింకు బస్టాండులోని సంజీవనీ బస్సు దగ్గరకొచ్చారు. అప్పటికే పరీక్షలు చేయించుకోవటానికి వచ్చినవారితో పెద్ద క్యూ ఉంది. దీంతో ఆ లైన్ లోనే శేఖర్ నిలబడ్డాడు. గంటన్నర తరువాత స్వాబ్స్ ఇచ్చారు. రిజల్ట్స్ మెసేజ్ పంపిస్తామని చెప్పటంతో ఇంటికెళ్లటానికి బయలుదేరారు తండ్రీ కొడుకులు.



అంతలోనే శేఖర్ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. అలా పడిపోయిన కొడుక్కి నీళ్లుతాగించాడుతండ్రి. సమర్యలు చేస్తూ కొడుకు కోసం రోదిస్తున్నాడు. కానీ అక్కడున్నవారు ఎవ్వరూ ముందుకు రాలేదు. కారణం కరోనా భయం. అక్కడికి రుయా హాస్పిటల్ దగ్గరే తీసుకెళదామంటే ఎవ్వరూ సహాయం లేరు. శేఖర్ పరిస్థితి చూసినవారు 108 కాల్ చేయగా 45 నిమిషాలకు వచ్చింది. రుయాలోని ఎమర్జన్సీ వార్డుకు తరలించారు. కానీ అప్పటికే శేఖర్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.తరువాత శేఖర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
కరోనా పరీక్షలు చేయించుకోవటానికి వచ్చిన కొడకు కళ్లముందే నేలరాలిపోవటాన్ని ఆతండ్రి తట్టుకోలేకపోయాడు. భోరుభోరున ఏడ్చాడు.



కడుపుతో ఉన్న కోడలికి నేనేం చెప్పను కొడుకా..అంటూ అతను ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారంతా కంటతడి పెట్టారు.గత మూడు రోజుల నుంచి ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికే వస్తున్నామని కానీ ఎవ్వరూ హాస్పిటల్ లోపలికి కూడా రానివ్వలేదని..కానీ నా కొడుకుని వైద్యం చేసుంటే ఇటువంటి దౌర్భాగ్యం వచ్చేది కాదని కంటీకి మింటికీ ఏకధారగా ఏడ్చాడు ఆ తండ్రి. కాగా శేఖర్ కరోనా రిపోర్టులు వచ్చాయి. నెగిటివ్ అని తేలింది. కానీ అప్పటికే అనారోగ్యంతో చనిపోయాడు శేఖర్. గర్భంతో ఉన్న భార్యను వదిలేసి..కన్నతల్లిదండ్రులను వదిలేసి శేఖర్ వెళ్లిపోయాడు..