కుప్పం యువతికి సోనూసూద్ సహాయం : CA చదువు కోసం రూ.లక్షన్నర ఫీజు కట్టిన సోనూ

  • Published By: nagamani ,Published On : August 27, 2020 / 03:45 PM IST
కుప్పం యువతికి సోనూసూద్ సహాయం : CA చదువు కోసం రూ.లక్షన్నర ఫీజు కట్టిన సోనూ

సోనూసూద్ పరిచయం అవసరంలేని పేరు. దాన గుణానికి సాక్షాత్తు ఆ దానకర్ణుడిని కూడా మరపిస్తున్నాడు. కష్టం ఉన్నాం అన్నా..అని నాలుగు అక్షరాలతో పిలిస్తే చాలు..నీకష్టానికి అడ్డంగా నేనున్నానంటు సహాయానికి మారుపేరుగా నిలుస్తున్నాడు.అటువంటి సోనూ సూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.చిత్తూరు జిల్లాలోని కుప్పంలోని ఓ యువతికి ఉన్నత చదువుల కోసం సహాయం చేశాడు.



సోనియా అనే విద్యార్ధినికి రూ.లక్షన్నర ఫీజు కట్టి చదువుకో తల్లీ అదే నీకు మంచి భవిష్యత్తునిస్తుందని భరోసానిచ్చాడు సోనూ. చదువుల్లో రాణిస్తున్న సోనియాకు చెన్నైలోని సీఏ అకాడమీలో సీటు ఇప్పించటమే కాకుండా రూ.1.50 లక్షల ఫీజు కట్టి తన దాతృత్వాన్ని మరోసారిచాటుకున్నాడు.
https://10tv.in/honoured-to-have-played-with-ms-dhoni-says-kl-rahul/
ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నా దానికి సరిపడా ఆర్థిక స్తోమత లేక చదువు మానేయాలనుకున్న సోనియాకు అండగా నిలబడ్డాడు. నాకు సీఏ చదవాలని కోరిక అన్నా సహాయం చేయమని ట్విట్టర్ లో సోనియా సోనూసూద్ ను కోరింది. అంతే నాలుగు అక్షరాల పిలుపుకి అలకించాడు. సోనియాకు చెన్నైలోని సీఏ అకాడమీలో సీటు ఇప్పించి రూ.లక్షన్నర ఫీజు కట్టాడు. మంచి సీఏ అయి దేశానికి మంచి చేయండి..దేశానికి గర్వకారణంగా నిలబడమని సూచించాడు సోనూ.



కాగా..ఇప్పటికే సోనూసూద్ ఎంతోమంది కష్టాన్ని ఆదుకున్నాడు. విద్యార్ధినీ విద్యార్ధుల చదువుల కోసం..వరదల కష్టంలో నిలవనీడ లేని ఓ వింతతు తల్లి కోసం ఓ ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. అలాగే చిత్తూరు జిల్లాలోని ఓ గిరిజన రైతు తన ఇద్దరు కూతుళ్లను కాడెద్దులుగా కట్టి పొలం దున్నతున్న గిరిజన రైతుకు ట్రాక్టర్ కొని ఇవ్వటం..అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని ఓ పేద తండ్రికి తన కూతురు ఆన్ లైన్ చదువుల కోసం తనకు జీవనాధారంగా ఉన్న ఒకే ఒక్క ఆవును అమ్మేసిన విషయం తెలిసి అతనికి ఆ ఆవును కొని ఇచ్చి..ఆ అమ్మాయి చదువు కోసం సహాయం…ఇలా లెక్కలేనని సహాయాలు సోనూ సూద్ ఖాతాలో ఉన్నాయి. ఇక వలస కూలీల కోసం సోనూ చేసిన సహాయం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రభుత్వాలు కూడా చేయలేని సహాయాన్ని చేశారు. అంతటితో వదిలేయకుండా నిరుపేద కూలీలు బ్రతకటానికి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నోన్నో ఈ కలియుగ దానకర్ణుడు సోనూసూద్ చేసిన సహాయాలు ఎన్నో.