Marriage : పెళ్లి సందడి-శ్రావణంలో కొద్ది ముహుర్తాలే, లేదంటే నాలుగు నెలలు ఆగాలి

శ్రావణ మాసం మొదలయ్యింది. పెళ్ళి  ముహుర్తాలతో కళ్యాణ మండపాలు...ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడిపోతున్నాయి.

Marriage : పెళ్లి సందడి-శ్రావణంలో కొద్ది ముహుర్తాలే, లేదంటే నాలుగు నెలలు ఆగాలి

Sravana Masam Marriages

Marriage :  శ్రావణ మాసం మొదలయ్యింది. పెళ్ళి  ముహుర్తాలతో కళ్యాణ మండపాలు…ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడిపోతున్నాయి. ఈఏడాది 2022 లో శ్రావణ మాసంలో ఆగస్టు నెల 21 వరకే పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెపుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అవివాహితులు ఒకింటి వారవుతున్నారు. ఆగస్టు ఒకటో తారీకు నుంచి మూడోవారం వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ముహుర్తాలు  పెట్టుకున్న వారి ఇళ్లల్లో పెళ్లి హాడావిడి మొదలైపోయిుంది.

జులై 31, ఆగస్టు 1, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 16, 17, 20, 21 తేదీల్లో అధిక ముహూర్తాలు ఉన్నాయని పండితులు సెలవిచ్చారు. ఆగస్టులో ముహూర్తం కుదరకపోతే ఆ తర్వాత 4 నెలల పాటు ఎదురు చూడాల్సి ఉండటంతో ఆగస్టులోనే పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.  ఆగస్టు 6వ తేదీ రాత్రి ముహూర్తానికి భారీ ఎత్తున పెళ్లిళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మాసంలో ముహూర్తాలు ఉన్న సమయంలో తారా బలాలు బాగుండటంతో ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు పేర్కొన్నారు.

గతంలో   శ్రావణ మాసంలో ముహుర్తం కుదరకపోతే..  కార్తిక మాసంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేవారు. జులై, ఆగస్టు నెలలలో కురిసే వానలకు భయపడి అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే కార్తికంలోని ముహూర్తాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది.  రాబోయే నాలుగు నెలలు గురు, శుక్ర మూఢాలు రావడంతో ముహూర్తాలు లేవని జ్యోతిష్య పండితులు, పురోహితులు చెబుతున్నారు.

ఇప్పుడు కాకపోతే డిసెంబరులో వచ్చే మార్గశిరం వరకు ఆగాల్సి ఉంటుందని చెబుతుండటంతో శ్రావణంలో ఎక్కువ మంది తాళి కట్టేందుకు సిధ్ధమవుతున్నారు. 20, 21 తేదీల్లో రోహిణీ నక్షత్రం రోజు కూడా అధికంగా పెళ్లిళ్లు ఉన్నాయని.. రోహిణి నక్షత్రం ఎక్కువమంది వధూవరులకు కలుస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఎనీ హౌ  కాబోయే కొత్త జంటలకు మనం కూడా ముందుస్తు వివాహశుభాకాంక్షలు తెలుపుదాం.

Also Read : Tirumala : ఆగస్టు 2న రూ.300/- ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల