పొందూరు కీచక ఎస్సై రామకృష్ణ సస్పెన్షన్

10TV Telugu News

పోలీసు వ్య‌వ‌స్థ‌కు మ‌చ్చ‌తెచ్చే ప‌ని చేసి ఉన్న ఉద్యోగం లోంచి సస్పెండ్ అయ్యాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొందూరు ఎస్సై కొల్లి రామకృష్ణ. తండ్రి మీద కేసు పెట్టకుండా ఉండాలంటే తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలంటూ మహిళను వేధించిన కేసులో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్…..పొందూరు ఎస్.ఐ ‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎస్‌ఐ రామకృష్ణ… తుంగపేటకు చెందిన అన్నెపు అప్పారావు ఇంట్లో ఇటీవల సోదాలు చేసి 48 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఇవి శుభకార్యం కోసం ఇంటికి తెచ్చుకున్న మద్యం బాటిళ్ళు అని, కేసు పెట్టోద్దని ఎస్సైను కాళ్ళా ,వేళ్లా పడి బతిమలాడుకున్నారు. ఆసమయంలో అప్పారావు కూతురు మీనాక్షిపై కన్నేసిన ఎస్సై రామకృష్ణ కేసు లేకుండా చేయాలంటే ఆమె తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలని షరతు పెట్టాడు.

ఈ క్రమంలో మీనాక్షిపై కామవాంఛ పెంచుకున్న ఎస్‌ఐ శుభ‌కార్యం కోసం అయితే కేసు నుంచి విడిచిపెడ‌తాను. నువ్వంటే నాకు ఇష్టం అంటూ తన ఇంటికి రావాలని ఆమెను ఆదేశించాడు.  తన బుద్ధి మార్చుకోకుండా ఇంటి అడ్రస్ చెపుతూ ఆమెకు ప‌దే పదే ఫోన్‌లు చేసి వేధించాడు.

తనకు గౌరమైన కుంటుంబం, తండ్రి, పిల్ల‌లు ఉన్నారని ఆమె తెలిపినా ఎస్సై వినలేదు.కోరిక తీరిస్తే నో కేసు… లేకపోతే.. కేసు తప్పదంటూ ఆ ఎస్సై చేసిన బెదిరింపుల ఆడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో ఎస్సై రామకృష్ణను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.

10TV Telugu News