Srikalahasti Fincare Bank Robbery : శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంకు చోరీ కేసు.. దర్యాఫ్తులో సంచలన నిజాలు

సంచలనం రేపిన శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్ చోరీ కేసుని పోలీసులు చేధించారు. బ్యాంకు మేనేజర్ స్రవంతిని అసలు దోషిగా తేల్చారు.(Srikalahasti Fincare Bank Robbery)

Srikalahasti Fincare Bank Robbery : శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంకు చోరీ కేసు.. దర్యాఫ్తులో సంచలన నిజాలు

Srikalahasti Fincare Bank Robbery

Srikalahasti Fincare Bank Robbery : రాష్ట్రంలో సంచలనం రేపిన శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్ చోరీ కేసుని పోలీసులు చేధించారు. కేసు వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. ఈ చోరీ కేసులో బ్యాంకు మేనేజర్ స్రవంతిని అసలు దోషిగా పోలీసులు తేల్చారు. స్రవంతితో పాటు మొత్తం 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకులో తాను పాల్పడిన అవకతవకల నుంచి బయటపడేందుకే.. బ్యాంకు మేనేజర్ స్రవంతి దోపిడీ డ్రామా ఆడిందని పోలీసులు వివరించారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఫిన్‌కేర్‌ బ్యాంకులో చోరీ.. రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయితో పాటు సహకరించిన ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. వీరి నుంచి రూ. కోటి విలువ చేసే 1274 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన కేజీ బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల 50 వేలు నగదు ఉంది. 840 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలు గుర్తించారు.(Srikalahasti Fincare Bank Robbery)

Bank Robbery : శ్రీకాళహస్తి ప్రైవేట్ బ్యాంకు చోరీ ఇంటి దొంగ పనే…!

ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ప్రధాన ముద్దాయి ఫిన్ కేర్ బ్యాంకు మేనేజర్, అప్రైజర్ స్రవంతితో పాటు బ్యాంకు దోపీడికి సహకరించిన శ్రీకాళహస్తికి చెందిన నవీన్, సుల్తాన్ మహమ్మద్, విజయ్ కుమార్, చెన్నైకు చెందిన మహమ్మద్ హుస్సేన్, జగదీష్ కుమార్, ఆంటోనీ రాజ్, అరుణ్‌లు ఉన్నారు. స్రవంతి సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లాలోని కొడమంచిలి. ఆమె శ్రీకాళహస్తిలో నివాసముంటూ ఫిన్ కేర్ బ్యాంకులో పని చేస్తున్నారు.

శ్రీకాళహస్తిలోని పెద్దమసీదు వీధిలో ఫిన్‌కేర్ ఫైనాన్స్ సంస్థలో.. గత గురువారం చోరీ జరిగింది. అక్కడ పనిచేసే సిబ్బంది రాత్రి ఇళ్లకు వెళ్లిపోయాక.. మేనేజర్ స్రవంతి మాత్రం రాత్రి 10.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆఫీసుకు సంబంధించి పెండిగ్ వర్క్ ఉంటే చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇంతలో ముగ్గురు దుండగులు లోపలికి వచ్చారని చెప్పుకొచ్చారు. ఆ దుండుగులు తనను బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి.. కాళ్లు, చేతులు కట్టేసి బంగారం, రూ.5 లక్షల డబ్బును ఎత్తుకెళ్లారని పోలీసులతో చెప్పారు.

Bank Robbery : శ్రీకాళహస్తిలో ప్రైవేట్ బ్యాంకులో అర్ధరాత్రి భారీ దోపిడీ..!

బ్యాంకులో చోరీ ఘటన కలకలం రేపింది. మేనేజర్ స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ క్రమంలో స్రవంతి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. అంతే, ఆ కోణంలో దర్యాప్తు చేస్తే షాకింగ్ నిజం వెలుగుచూసింది. ఈ చోరీ వెనుక స్రవంతి హస్తం ఉన్నట్లు తేలింది. పని చేస్తున్న సంస్థనే బురిడీ కొట్టించాలని స్రవంతి చూసింది. బ్యాంకు లో దొంగలు పడి దోచుకెళ్లారని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. స్రవంతి అడ్డంగా బుక్కయింది.

బ్యాంకు చోరీ గురించి తనకేమీ తెలియనట్లుగా మేనేజర్ స్రవంతి నాటకం ఆడింది. తన డైలాగులతో డ్రామాను పండించింది. గురువారం రాత్రి 11 గంటల వరకు బ్యాంక్‌లో కొన్ని పనులు చేసుకుంటున్నాం. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి చొరబడ్డారు. కత్తి చూపించి బెదిరించారు. నా చేతులు కాళ్లు కట్టేశారు. నోటిలో క్లాత్ ఉంచి మాట్లాడకుండా చేశారు. లాకర్ తాళాలు ఇవ్వమని బెదిరించారు. భయంతో నేను తాళాలు ఇచ్చేశా. దుండగులు బ్యాంకు లాకర్లలోని నగలు, డబ్బు ఎత్తుకెళ్లిపోయారు. దొంగలు హిందీ, తమిళ్ మాట్లాడుతున్నారు” అని బ్యాంకు మేనేజర్ స్రవంతి పోలీసులతో చెప్పింది. చివరికి పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా.. అసలు నిజం బయటపడింది. చోరీ వెనుక మాస్టర్ మైండ్ మేనేజర్ స్రవంతి అని తేలింది.