Sexual Harassment : ఆలయంలో ఉద్యోగులు.. లైంగిక వేధింపులు

శ్రీశైలం దేవస్దానంలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న కొందరు యువకులు పరిసర ప్రాంతాల్లోని మహిళలు, విద్యార్థినిల ఫోన్ నంబర్లు సేకరించి.. వారికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు

Sexual Harassment : ఆలయంలో ఉద్యోగులు.. లైంగిక వేధింపులు

Sexual Harassment

Sexual Harassment : కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహిళలు, విద్యార్థినీలపై లైంగిక వేధింపులు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీశైలం దేవస్దానంలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న కొందరు యువకులు పరిసర ప్రాంతాల్లోని మహిళలు, విద్యార్థినిల ఫోన్ నంబర్లు సేకరించి.. వారికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. పర్సనల్ ఫోటోలు పంపుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తమ కోరిక తీర్చాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఆడియోలు స్థానికంగా వైరల్ అయ్యాయి.

చదవండి : Srisailam : రేపటి నుండి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

తమ కోరిక తీర్చాలంటూ శ్రీశైలం సమీపంలోని సున్నిపెట్ట గ్రామానికి చెందిన విద్యార్థులు, మహిళకు ఫోన్ చేస్తున్నారు దేవాలయంలో పనిచేసే కొందరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు. తాము ఫోన్ చేసినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. విద్యార్థినిలకు డబ్బు ఆశచూపుతు లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థినిల మెయిల్ ఐడిలు హ్యాక్ చేసి అసభ్య సందేశాలు పంపుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది చర్యను బయటకు చెప్పలేక విద్యార్థినిలు, వారితల్లిదండ్రులు లోలోపల కుమిలిపోతున్నారు.

చదవండి : Srisailam : యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన

ఇక ఇందుకు సంబందించిన ఆడియోలు బయటకు రావడంతో దేవస్థానం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఓ సెక్యూరిటీ గార్డు సెల్‌ఫోన్‌లో వేలకొద్ది అమ్మాయిలు, మహిళల ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. కాగా ఆ సెక్యూరిటీని విధుల నుంచి తొలగించినట్లు తెలియవచ్చింది. కాగా దేవస్థానం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి చెడు పనులు చేయడం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తుంది. పవిత్రంగా ఉండే స్థలంలో ఇలాంటి కీచకులను తొలగించాలని.. కఠినంగా శిక్షించాలని సున్నిపేట వాసులు కోరుతున్నారు. తమ గ్రామంలో అనేకమంది విద్యార్థినిలకు ఫోన్ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.