Thirumala : వేంక‌టాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మలయప్పస్వామివారు వేంక‌టాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు.

Thirumala : వేంక‌టాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tirumala (1)

Srivari Salakatla Brahmotsavalu : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగ‌ళ‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు వేంక‌టాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

CM Jagan : తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

కాగా, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నసేవ జ‌రుగుతుంది. రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు. వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటి ఈవో శ్రీ ర‌మేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తిరుమలలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం జరిగిన ఉత్సవాల్లో స్వామివారికి ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవాళ.. స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టీటీడీ చైర్మన్, ఈవో స్వాగతం పలికారు.

Thirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు

అనంతరం సీఎం జగన్ ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించారు. వాటి లోగోలు ఆవిష్కరించారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన రెండో బూందీ పోటును ప్రారంభించారు. టీటీడీ గో ఆధారిత పంటల కొనుగోలు అంశంపై అన్నమయ్య భవన్ లో రైతులతో ఎంఓయూ కార్యక్రమానికి హాజరవుతారు.