కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈసీ అభ్యంతరం..సీఎస్‌ కు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ

  • Published By: bheemraj ,Published On : November 17, 2020 / 11:08 AM IST
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈసీ అభ్యంతరం..సీఎస్‌ కు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ

AP new districts formation : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని.. అది పూర్తయ్యే వరకు జిల్లాల పునర్విభజన చేయవద్దంటూ ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆపాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ పంపించారు.



13 జిల్లాల ప్రాతిపదికన ఎన్నికల ప్రక్రయి చేపట్టామని.. ఎన్నికలు పూర్తయ్యే వరకు 13 జిల్లాలే ఉండాలంటూ లేఖ రాశారు. జిల్లాలు పెంచడం వల్ల జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సాంకేతిక సమస్యలు ఎదురువుతాయన్న విషయాన్ని నిమ్మగడ్డ సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు.



https://10tv.in/three-political-parties-contest-in-tirupati-parliament-by-elections/
అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. గతంలో సీఎస్ నీలం సాహ్ని నేతృత్వంలోని కమిటీకి తోడు నాలుగు సబ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే సీఎస్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసింది. జిల్లాల పునర్విభజనపై కమిటీ అధ్యయనం దాదాపు పూర్తి అయినట్టే కనిపిస్తోంది.



జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ.. నిర్మాణాత్మకత, సిబ్బంది, పునర్విభజన అధ్యయనానికి రెండో సబ్ కమిటీ.. మౌలిక సదుపాయాల అధ్యయనం, ఆస్తుల అధ్యయనానికి మూడవ సబ్ కమిటీ.. ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి నాలుగవ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంక్రాంతి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.