CM Jagan: సీఎం జగన్ చేతుల మీదుగా పోర్ట్ పనులు ప్రారంభం

సీఎం జగన్ రామాయపట్నం పోర్ట్ ప్రాంతానికి విచ్చేయనున్నారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు తీర ప్రాంతమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియాలో హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుతారు.

CM Jagan: సీఎం జగన్ చేతుల మీదుగా పోర్ట్ పనులు ప్రారంభం

Cm Jagan

 

CM Jagan: సీఎం జగన్ రామాయపట్నం పోర్ట్ ప్రాంతానికి విచ్చేయనున్నారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు తీర ప్రాంతమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియాలో హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుతారు.

సముద్రుడికి పూజ చేసి, భూమి పూజచేసి పోర్ట్ పనులను ప్రారంభిస్తారు. ఫైలాన్ ఆవిష్కరించిన అనంతరం పోర్ట్ నిర్వాసితులతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొంటారు. 12గంటల 30నిమిషాలకు పోర్ట్ నిర్వాసితులు, రైతులను ఉద్దేశించి మాట్లాడతారు.

పోర్ట్ పనులు ప్రారంభించి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా కావలి వాసుల కల నెలవేర్చనున్నారు. పోర్ట్ పూర్తయితే ఈ ప్రాంతంలోని యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు దొరికినట్లే.

Read Also : ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2కోట్లు, ఒక్కో సచివాలయానికి రూ.20లక్షలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

పోర్ట్ కోసం తొలి విడతగా 850 ఎకరాలు భూ సేకరించారు. భూములిచ్చిన సుమారు 600కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాసానికై సీఎం చేతుల మీదుగా పట్టాలను అందిస్తారు. ఇప్పటికే రైతులకు, నిర్వాసితులకు 80 శాతం పరిహారం చెల్లింపు పూర్తి అయింది.

మొత్తం 11 బెర్త్‌ల నిర్మాణం చేసేలా ప్రణాళికలు రూపొందించగా.. తొలి దశలో 3 వేల కోట్ల వ్యయం తో 4 బెర్త్ లు నిర్మించనున్నారు. ఈ క్రమంలోనే హైవే నుండి తీర ప్రాంతం పోర్ట్ ఏరియా వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.