AP Weather: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, రాబోయే 24 గంటల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

AP Weather: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

AP Weather: నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్యంగా 420 కి.మీ దూరంలో, తమిళనాడులోని నాగపట్నం దక్షిణ ఆగ్నేయానికి 600 కి.మీ దూరంలో, చెన్నైకి 690 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.

Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, రాబోయే 24 గంటల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా సాగి, అనంతరం అక్కడ్నుంచి రాబోయే 48 గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా, శ్రీలంక మీదుగా కొమోరిన్‌ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ వర్షాల ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఏపీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోయాయి. చలి తీవ్రత బాగా పెరిగింది. మంచు కూడా ఎక్కువగానే కురుస్తోంది. దీంతో ఏపీ ప్రజలు చలితో వణుకుతున్నారు. తాజా తుపాను నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.