Agnipath: నేడు సుబ్బారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు!

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళ‌న‌కారులు విధ్వంసానికి పాల్ప‌డిన‌ కేసులో నిందితుడు, సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్ట‌ర్ సుబ్బారావును నేడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

Agnipath: నేడు సుబ్బారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు!

Secunderabad Station Mastermind

Agnipath: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళ‌న‌కారులు విధ్వంసానికి పాల్ప‌డిన‌ కేసులో నిందితుడు, సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్ట‌ర్ సుబ్బారావును నేడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. సాయి డిఫెన్స్ అకాడమీ ఉద్యోగి శివను, పలువురు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధ్వంసం జ‌రిగిన‌ రోజు ఉప్పల్ అకాడమీలో సుబ్బారావు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

presidential election: ఢిల్లీ చేరుకున్న ద్రౌప‌ది ముర్ము.. రేపు నామినేష‌న్ దాఖలు

సుబ్బారావు పాత్రపై ఆందోళనకారుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నారు. హకీంపేట్ సోల్జర్స్ గ్రూప్‌లో సుబ్బారావు ఆందోళనకారులకు మద్దతిస్తున్నట్టు పోస్టులు ఉన్నాయి. అలాగే, కీలక నిందితులతో సుబ్బారావు ఫోనులో మాట్లాడారు. ఈ కేసులో ఏ2 పృథ్వీరాజ్ కూడా సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేష‌న్‌లో విధ్వంసం ఘటనలో పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు కీలకంగా వ్యవహరించారు.ఇప్పటివరకు 63 మందిని పోలీసులు నిందితులుగా తేల్చారు. 56 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చంచల్ గూడా జైల్‌కు త‌ర‌లించారు.