Vijayawada : మహిళా SI ఆత్మహత్యాయత్నం

విజయవాడలో ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యకు యత్నించింది. శనివారం (జూన్ 12,2021) రాత్రి అయోధ్యనగర్ లో జరిగిన ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించటంతో ప్రాణాపాయం నుంచి బైటపడింది. పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉత్తర మండలంలో పనిచేస్తున్న మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ శనివారం రాత్రి ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించింది.

Vijayawada : మహిళా SI ఆత్మహత్యాయత్నం

Women Si

Suicide attempt by a woman Si : విజయవాడలో ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యకు యత్నించింది. శనివారం (జూన్ 12,2021) రాత్రి అయోధ్యనగర్ లో జరిగిన ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించటంతో ప్రాణాపాయం నుంచి బైటపడింది. పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉత్తర మండలంలో పనిచేస్తున్న మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ శనివారం రాత్రి ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈమె ఆత్మహత్యకు యత్నించడం వెనుక సీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ ఎస్ఐతో ప్రేమ వ్యవహారమే కారణమన్నట్లుగా సమాచారం.

కొంతకాలంగా వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం..అప్పటికే సదరు ఎస్సై తన దగ్గర బంధువుని వివాహం చేసుకుని ఉండటంతో వీరి ప్రేమ వివాహం కాస్తా బైటపడటంతో మహిళా ఎస్సై ఆత్మహత్యకు యత్నించినట్లుగా తెలుస్తోంది. వీరి ప్రేమ విషయం బయటపడటంతో ఓ మహిళ మహిళా ఎస్సైకు వార్నింగ్ ఇవ్వటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించినట్లుగా తెలుస్తోంది.

మహిళా ఎస్ఐ ఆత్మహత్యాయత్నం సమాచారం తెలిసిన వెంటనే సీసీఎస్‌లోని ఎస్ఐ ఆమె ఇంటికి వెళ్లినట్టు ఈ ఆత్మహత్యు సంబంధించిన దర్యాప్తులో తేలింది. మహిళా ఎస్ఐ, సీసీఎస్‌లోని ఎస్ఐపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లుగానే..వారిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. కాగా మహిళా ఎస్సై ఆత్మహత్యకు సంబంధించిన కేసు అజిత్‌సింగ్ నగర్ సీఎస్ లో నమోదు కావటంతో ఈ కేసుమీద దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.