జగన్ నిర్ణయాలతో దేశ జీడీపీ కూడా తగ్గిపోతోంది : సుజనా చౌదరి

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. మూడు రాజధానుల అంశంపై విమర్శలు చేశారు. అసలు

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 04:57 AM IST
జగన్ నిర్ణయాలతో దేశ జీడీపీ కూడా తగ్గిపోతోంది : సుజనా చౌదరి

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. మూడు రాజధానుల అంశంపై విమర్శలు చేశారు. అసలు

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. మూడు రాజధానుల అంశంపై విమర్శలు చేశారు. అసలు మూడు రాజధానుల ప్రస్తావన ఏంటో అర్థం కావడం లేదన్నారు. అమరావతి రాజధానిగా గతంలో జగన్ ఒప్పుకున్నారని సుజనాచౌదరి గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా ఎందుకు మాట్లాడుతున్నారని  ప్రశ్నించారు. జీఎన్ రావు కమిటీ తలాతోక లేని నివేదిక ఇచ్చిందని సుజనా చౌదరి సీరియస్ అయ్యారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాలతో దేశ జీడీపీ కూడా తగ్గిపోతోందని సుజనా చౌదరి అన్నారు.

రాజధాని మారుస్తామని చెబుతున్న సీఎం జగన్.. అమరావతి రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర రూ.2లక్షల కోట్ల డబ్బు ఉందా అని అడిగారు. కాంట్రాక్టర్లు కోర్టుకి వెళ్తే పరిహారం చెల్లించగలరా అని అడిగారు. రాజధాని విషయంలో కేంద్రం చూస్తూ ఊరుకోదు అని సుజనా చౌదరి అన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ చేయడంలో తప్పు లేదు.. కానీ పాలన వికేంద్రీకరణ కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. రాజధాని అంటే కారు మార్చినంత సులువు కాదన్నారు.

సుజనా చౌదరి కామెంట్స్:
* అమరావతి రాజధానిగా గతంలో జగన్ ఒప్పుకున్నారు
* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతున్నారు
* జీఎన్ రావు కమిటీ తలా తోక లేని నివేదిక ఇచ్చింది
* రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర లక్షన్నర నుంచి రూ.2లక్షల కోట్ల డబ్బుందా
* కాంట్రాక్టర్లు కోర్టుకి వెళ్తే పరిహారం చెల్లించగలరా
* ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలతో దేశ జీడీపీ కూడా తగ్గిపోతోంది
* రాజధాని విషయంలో కేంద్రం చూస్తూ ఊరుకోదు
* పరిపాలన వికేంద్రీకరణ కరెక్ట్ కాదు
* ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదు

* ప్రభుత్వ మారినప్పుడల్లా రాజధాని మారిస్తే అభివృద్ధి జరగదు
* ఏడాదిలో 30 రోజులు జరిగే అసెంబ్లీ అమరావతిలో పెడితే రాజధాని అంటారా
* అమరావతి పేరిట గత ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేసింది.. వాటి పరిస్థితి ఏంటి
* అమరావతిలో ఆస్తులు తీసుకున్న ప్రైవేట్ సంస్థలు కోర్టుకెళ్తే రూ.2లక్షల కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది
* ఇన్ సైడర్ ట్రేడింగ్ పై నా చాలెంజ్ కు సమాధానం లేదు
* రాజధాని కదిలితే ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుంది
* 13 జిల్లాల ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది
* ఇది ఒక్క అమరావతి సమస్యే మాత్రమే కాదు

Also Read : న్యూఇయర్ రోజు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయం : మందుబాబులకు బెంగళూరు మెట్రో శుభవార్త