Andhra pradesh : ల్యాప్ టాప్ పేలి గాయపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుమలత మృతి

కడప జిల్లా కోడూరులో విషాదం నెలకొంది. ల్యాప్ టాప్ పేలి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందింది.

Andhra pradesh : ల్యాప్ టాప్ పేలి గాయపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుమలత మృతి

Software Engineer

Andhra pradesh :  కడప జిల్లా కోడూరులో విషాదం నెలకొంది. ల్యాప్ టాప్ పేలి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం ల్యాప్ టాప్ పై పనిచేస్తుండగా అది పేలి సుమలత అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈక్రమంలో గాయపడిన సుమలత మృతి చెందింది.ల్యాప్ టాప్ కు చార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆమె గాయాలు కావటంతో తిరుపతి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయాలు ఎక్కువగా కావటంతో మేకవారిపల్లెకు చెందిన 24ఏళ్ల సుమలత చికిత్స పొందుతు మృతి చెందింది.

Also read : Kadapa : వర్క్ చేస్తుండగా పేలిన ల్యాప్ టాప్, సాప్ట్ వేర్ ఇంజినీర్లు జాగ్రత్త

కాగా కోవిడ్ కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. కరోనా తగ్గిన సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ హోం కొనసాగిస్తున్నాయి. గత రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇళ్ల వద్ద నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆఫీసుల్లో వర్క్ కండీషన్లకు తగిన విధంగా విద్యుత్ సప్లై, ఎయిర్ కండీషన్ సదుపాయం ఉంటుంది. కానీ ఉద్యోగుల ఇళ్లలో ఈ సౌకర్యాలు అంతంత మాత్రమే.

అసలే వేసవి కాలం కాబట్టి విద్యుత్ కోతలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, ఎండ వేడిమి, ఇతర కారణాల వల్ల ల్యాప్ టాప్ పనితీరుపై ప్రభావం పడతాయి. ఉద్యోగులు ఉదయం నుంచే ల్యాప్ టాప్ లను పట్టుకుని వర్క్ చేస్తుంటారు. వర్క్ చేసే క్రమంలో ల్యాప్ టాప్ ఆఫ్ అయిపోతుండడంతో ఛార్జింగ్ పెట్టి పనిచేస్టుంటారు. ఇలా చేయడమే ఓ మహిళా సాఫ్ట్ వేర్ ప్రాణాలు పోయేలా చేసింది. ల్యాప్ టాప్ పేలిన ఘటనలో సాప్ట్ వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.