Viveka Murder Case: ఇంట్లో వాడుకునే వస్తువులనే సీబీఐ సీజ్ చేసింది -సునీల్ తండ్రి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుల్లో ఒకరైన వైకాపా కార్యకర్త యాదటి సునీల్‌ యాదవ్‌(26) తండ్రి కృష్ణయ్య యాదవ్ ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Viveka Murder Case: ఇంట్లో వాడుకునే వస్తువులనే సీబీఐ సీజ్ చేసింది -సునీల్ తండ్రి

Viveka

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుల్లో ఒకరైన వైకాపా కార్యకర్త యాదటి సునీల్‌ యాదవ్‌(26) తండ్రి కృష్ణయ్య యాదవ్ ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఇంట్లో వాడుకునే వస్తువులను సీబీఐ అధికారులు సీజ్ చేశారని, రెండు కొడవళ్ళు, ఒక మాంసం కొట్టుకునే కత్తి, ఒక మచ్చు కత్తి ఇంట్లో సీజ్ చేసినట్లు సీబీఐ అధికారులు నాకు లెటర్ ఇచ్చారని చెప్పారు. వివేకానందరెడ్డి లాంటి మంచి వ్యక్తిని నా కుమారుడు హత్య చేశాడని అనడం అవాస్తవమని చెప్పారు కృష్ణయ్య యాదవ్. మేము అలాంటి వాళ్ళం కాదని సీబీఐకి కూడా చెప్పినట్లు వెల్లడించారు.

ఇదే విషయమై సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నందుకు మా అన్నను అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. మా ఇంట్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సీబీఐ అధికారులు తనిఖీలు చేశారని, మా అన్నకు సంబంధించిన బ్యాంకు పాస్ పుస్తకాలు ఒక పాత షర్టు కొన్ని ఫోటోలు అధికారులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఎర్ర గంగిరెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, దస్తగిరిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అని ప్రశ్నించారు యాదవ్.

ఇక వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సీబీఐ, మాజీ డ్రైవర్ దస్తగిరి ఇంట్లో ఒక మచ్చు కత్తి మరి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో కూడా కొన్ని ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద రెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి సోదరుడు ఉమా శంకర్ రెడ్డి ఇంట్లో కూడా రెండు మచ్చు కత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.