చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత హత్యకు కుట్ర

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సీనియర్ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విద్యాసాగర్ హత్యకు ప్రత్యర్థులు.. పీలేరుకి చెందిన రౌడీషీటర్ గణేష్ కు

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 05:03 AM IST
చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత హత్యకు కుట్ర

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సీనియర్ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విద్యాసాగర్ హత్యకు ప్రత్యర్థులు.. పీలేరుకి చెందిన రౌడీషీటర్ గణేష్ కు

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విద్యాసాగర్ హత్యకు పీలేరుకి చెందిన రౌడీషీటర్ గణేష్ తో విద్యాసాగర్ ప్రత్యర్థులు ఒప్పందం చేసుకున్నారు. గణేష్ కు సుపారీగా రూ.10లక్షలు ఇచ్చారు. ఇందులో భాగంగా అడ్వాన్స్ గా రూ.2.5లక్షలు చెల్లించారు.

హత్యకు రూ.10లక్షలు సుపారీ:
మర్డర్ కు స్కెచ్ వేసిన ప్రత్యర్థులు విద్యాసాగర్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు. అనుమానం వచ్చిన విద్యాసాగర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కుట్రను భగ్నం చేశారు. రౌడీషీటర్లు గణేష్, రత్నంను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ కారణాలతోనే తన హత్యకు కుట్ర జరిగిందని విద్యాసాగర్ ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

హత్యకు కుట్ర చేసింది ఎవరు?
వైసీపీ నేత హత్యకు కుట్ర చేయడం, రూ.10లక్షలు సుపారీ ఇవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. విద్యాసాగర్ హత్యకు కుట్ర చేసింది ఎవరు? అని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ కుట్ర వెలుగులోకి రావడంతో విద్యాసాగర్ అలర్ట్ అయ్యారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దీనిపై దర్యాఫ్తు జరుగుతోందన్న పోలీసులు త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

20ఏళ్లు టీడీపీలో ఉన్న విద్యాసాగర్:
విద్యాసాగర్ కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన సీనియర్ నేత. 20 ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న ఆయన.. స్థానిక పార్టీ నాయకత్వంలో విభేదించి.. రెండేళ్ల క్రితం వైసీపీలో చేరారు. వైసీపీలోకి వచ్చినా.. అటు టీడీపీలో, ఇటు వైసీపీలో విద్యాసాగర్ కు పెద్ద సంఖ్యలో ప్రత్యర్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసాగర్ హత్యకు భారీ కుట్ర జరిగిందని విద్యాసాగర్ అనుచరులు అంటున్నారు. విద్యాసాగర్ వైసీపీ లీడర్ అని తెలుసుకున్న రౌడీషీటర్ గణేష్.. స్వయంగా విద్యాసాగర్ కి ఫోన్ చేశాడు. మిమ్మల్ని చంపడానికి నాకు రూ.10లక్షలు ఇస్తామని చెప్పారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని విద్యాసాగర్ ను గణేష్ హెచ్చరించాడు. దీంతో అలర్ట్ అయిన విద్యాసాగర్ వెంటనే కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పరారీలో మరో ఇద్దరు:
రంగంలోకి దిగిన పోలీసులు హత్య కుట్రను భగ్నం చేశారు. ఈ కేసుని చేధించే పనిలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు… కృష్ణమూర్తి, రమేష్ అనే మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. విద్యాసాగర్ ను ఎవరు చంపాలని అనుకున్నారు? ఇంత భారీ స్థాయిలో స్కెచ్ వేసి ఎందుకు చంపాలని అనుకున్నారు? ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు దొరికితే కానీ.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదని పోలీసులు అంటున్నారు.