Srisailam Temple : మల్లన్న సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దంపతులు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ 2021, జూన్ 18వ తేదీ శుక్రవారం శ్రీశైలానికి వెళ్లారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సతీసమేతంగా దర్శించుకున్నారు.

Srisailam Temple : మల్లన్న సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దంపతులు

Srisailam Temple

Supreme Court Chief Justice : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ.రమణ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ 2021, జూన్ 18వ తేదీ శుక్రవారం శ్రీశైలానికి వెళ్లారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సతీసమేతంగా దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా…శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న చీప్ జస్టీస్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పుష్ప గుచ్చం, పూల మొక్కలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.

ఆలయ ఈఓ కెఎస్ రామారావు, అర్చకులు, వేదపండితులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. పోలీసులు నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీజె దంపతులు ధ్వజస్థంభానికి నమస్కరించి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో సీజే దంపతులకు అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు.

ఈఓ కెఎస్ రామారావు స్వామి, అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించారు. జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచబ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డీఐజీ వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ కృపాసాగర్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె. పక్కిరప్ప తదితరులు పాల్గొన్నారు.