ఏపీలో ఇంగ్లీషు మీడియం అమలు..హైకోర్టు ఉత్తర్వులపై స్టే కు సుప్రీం నిరాకరణ

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 11:24 AM IST
ఏపీలో ఇంగ్లీషు మీడియం అమలు..హైకోర్టు ఉత్తర్వులపై స్టే కు సుప్రీం నిరాకరణ

ఏపీలో ఇంగ్లీష్‌ మీడియం అమలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హై కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.



ప్రతివాదులు రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణనను 2020, సెప్టెంబర్ 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తి చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.



ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇటీవలే హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 81.85 ను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్ చేస్తూ బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. 2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం వీటిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఏ మీడియంలో చదవాలన్న అంశాన్ని విద్యార్థుల నిర్ణయానికి వదిలివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేయడం సరికాదన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల భవిష్యత్ కు ఉపయోగపడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.



ప్రభుత్వం కూడా ఇందుకు మూడు ఆప్షన్లు ఇచ్చింది. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన, ఇతర మాతృ భాషల్లో బోధనలో ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. మొత్తం 17లక్షల 97వేల 168 మంది నుంచి ఆప్షన్లు రాగా 53వేల 943 మంది తెలుగు మీడియంలో బోధన కోరుకున్నారు.
https://10tv.in/old-guards-have-sabotaged-rahul-gandhi-shiv-sena/
అయితే ఈ విద్యార్థుల కోసం ఆయా పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తరగతుల ఏర్పాటు పాలనాపరంగా, ఆర్థికపరంగా సాధ్యం కాదు కనుక గతంలో ఇచ్చిన జీఓ 15 ప్రకారం ప్రతి మండల కేంద్రంలో (672 మండలాల్లో) ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. దూరంగా ఉన్నవారికి రవాణా ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది.



ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు జై కొట్టారు. ఈమేరకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. 96.17శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియమే కావాలంటూ స్పష్టం చేశారు.

ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో మొదటి ఐచ్ఛికాన్ని టిక్‌ చేస్తూ, తమ అంగీకారం తెలుపుతూ 96.17శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియంను కోరుకున్నవారు 3.05 శాతం మంది. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం. ఏప్రిల్‌ 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయి.