Varavara Rao: వరవర రావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్‌ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.

Varavara Rao: భీమా కోరేగావ్ కేసులో విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం తాజా తీర్పు వెల్లడించింది. భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి వరవర రావుపై పుణే పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట

2018, ఆగష్టు 28న ఆయన హైదరాబాద్‌లో అరెస్టయ్యారు. అనంతరం ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ అయ్యింది. 2018 నుంచి జైలు శిక్ష అనుభవించిన వరవర రావుకు 2021 ఫిబ్రవరి 22న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం బెయిల్ పొడిగిస్తూ వచ్చారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల తనకు శాశ్వత బెయిల్ కావాలని ఆయన బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు కొట్టివేసింది. దీంతో బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై ఎన్ఐఏకు, వరవర రావు లాయర్‌కు మధ్య వాడివేడి వాదనలు సాగాయి. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఐఏ తరఫు న్యాయవాది కోరారు.

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

వరవర రావు ఆరోగ్యంగానే ఉన్నారని, అందుకు ఆయనకు ఇచ్చిన డిశ్చార్జ్ సర్టిఫికెటే సాక్ష్యమని ఎన్ఐఏ తరఫు న్యాయవాది చెప్పారు. అయితే, ఈ వాదనతో సుప్రీంకోర్టు విబేధించింది. అనారోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు లేదా అని ప్రశ్నించింది. కాగా, ఇంకో పదేళ్లకు కూడా ఈ కేసు విచారణ పూర్తి కాదని వరవర రావు తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు ఇప్పటివరకు ఆయనపై మోపిన అభియోగాల్ని ఎన్ఐఏ నిరూపించలేకపోయింది. దీంతో 82 ఏళ్ల వయసులో రెండున్నరేళ్లపాటు ఆయన జైళ్లోనే ఉన్నారని సుప్రీంకోర్టు గుర్తించింది. అలాగే వరవర రావు అనారోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆయనకు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది.

Bihar Deputy CM బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్.. ఆర్‌జేడీకి జాక్‌పాట్!

అయితే ఆయన ఈ బెయిల్‌ను దుర్వినియోగం చేయరాదని, సాక్షులను కలవరాదని సూచించింది. అలాగే తన ఆరోగ్య పరిస్థితిని ఎన్ఐఏకు తెలపాలని కూడా సూచించింది. విచారణను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు దిగొద్దని కూడా ఆదేశించింది.

 

ట్రెండింగ్ వార్తలు