Supreme Court : కృష్ణా జలాల వివాదంపై ఏపీ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ

కృష్ణా నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది.

10TV Telugu News

Krishna river : కృష్ణా నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఏపీ పిటిషన్ ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మరొక ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు న్యాయపరంగానే సమస్య పరిష్కారం కోరుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

అటు సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం కోరగా సీజేఐ నిరాకరించారు. ఈ పిటిషన్ ను తాను విచారణ చేపట్టబోనని జస్టిస్ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. మరోవైపు మధ్యవర్తిత్వానికి ఏపీ ప్రభుత్వం మొగ్గుచూపడం లేదు. కోర్టే తేల్చాలని కోరుతోంది.

కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయరమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు సుప్రీం విచారణ చేపట్టింది.

10TV Telugu News