న్యాయం కొనాలా : ముకుల్ రోహత్గికి రూ. 5 కోట్లు చెల్లింపు – బాబు

  • Published By: madhu ,Published On : January 23, 2020 / 07:33 AM IST
న్యాయం కొనాలా : ముకుల్ రోహత్గికి రూ. 5 కోట్లు చెల్లింపు – బాబు

ప్రభుత్వం తరపున వాదించడానికి ముకుల్ రోహత్గికి రూ. 5 కోట్లు చెల్లిస్తున్నారని, రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చారని ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఒక్క న్యాయవాదికి అంత డబ్బు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రముఖ న్యాయవాదులందరినీ జగన్ ప్రభుత్వం బ్లాక్ చేస్తోందని, పరిస్థితి ఇలా ఉంటే…ఈ దేశంలో న్యాయపరిస్థితి ఏంటనీ, న్యాయాన్ని కూడా కొనాలా అని ప్రశ్నించారు. 2020, జనవరి 23వ తేదీ గురువారం ఆయన ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడారు. 

పేద రైతులు, జేఏసీ, పేద పార్టీలు మీతో ఎలా పోరాడగలుగుతాయని ప్రశ్నించారు. ఇదంతా ఎవరు సొమ్ము ? ప్రజల సొమ్ము కాదా అని నిలదీశారు బాబు. జగన్ తరపున సీబీఐ కేసులను ముకుల్ రోహత్గి వాదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనకు ఉదారంగా డబ్బులు చెల్లిస్తున్నారని విమర్శించారు. ప్రజలు వీటన్నింటినీ అర్థం చేసుకుంటారని, అయితే…చివరకు న్యాయమే గెలుస్తుందని బాబు చెప్పారు. 

* ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు.
* రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే.
* దీనితో ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ తర్జనభర్జనలు పడుతున్నారు.
 

* అందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించారు. 
* సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో జగన్ చర్చలు జరిపారు.
* న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. 
 

* అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
* మండలిలో కీలక బిల్లులకు బ్రేక్ వేసింది టిడిపి. 
* స్పీకర్ తన విచక్షణాధికారంతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపింది.

Read More : అత్యంత ధనవంతుడు బాబు : రూ. 186 కోట్లు – వరప్రసాద్