Durga Malleswara Swamy Teppotsavam : ప్రకాశం బ్యారేజీలో దుర్గా మల్లేశ్వర స్వామి తెప్పోత్సవంపై సస్పెన్స్

దసరా రోజున ప్రకాశం బ్యారేజీలో బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవంపైన సందిగ్దత నెలకొంది. కృష్ణా నదికి వరద పెరగడంతో తెప్పోత్సవంపైన సస్పెన్స్ కొనసాగుతోంది. తెప్పోత్సవం నిర్వహించకుండా కేవలం హంస వాహనంపై ఊరేగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

Durga Malleswara Swamy Teppotsavam : ప్రకాశం బ్యారేజీలో దుర్గా మల్లేశ్వర స్వామి తెప్పోత్సవంపై సస్పెన్స్

Durga Malleswara Swamy Teppotsavam : దసరా రోజున ప్రకాశం బ్యారేజీలో బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవంపైన సందిగ్దత నెలకొంది. కృష్ణా నదికి వరద పెరగడంతో తెప్పోత్సవంపైన సస్పెన్స్ కొనసాగుతోంది. తెప్పోత్సవం నిర్వహించకుండా కేవలం హంస వాహనంపై ఊరేగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కుల వరద వస్తుండటంతో తెప్పోత్సవం నిర్వహించడం సరికాదంటున్నారు బ్యారేజీ అధికారులు. నీటి ప్రవాహం 30వేల క్యూసెక్కుల లోపు ఉంటేనే.. అనుమతి ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. గతేడాది కూడా వరద నీరు పోటెత్తడంతో నది ఒడ్డునే తెప్పోత్సవం నిర్వహించారు ఆలయ అధికారులు.

ప్రతి ఏటా దసరా సందర్భంగా విజయవాడ దగ్గర కృష్ణా నదిలో కనకదుర్గమ్మ తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుండడంతో దసరా రోజున దుర్గమ్మ తెప్పోత్సవం నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీలో 30 వేల క్యూసెక్కుల లోపు నీరు ఉంటేనే తెప్పోత్సవం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో, అమ్మవారి జలవిహారంపై మంగళవారం అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం కానుంది.

దుర్గమ్మ తెప్పోత్సవానికి జలవనరుల శాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదని కాగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. దసరా రోజున వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే, కనకదుర్గ అమ్మవారితో కూడిన హంస వాహనాన్ని నదిలో ఒకే చోట నిలిపి ఉత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు.